పీవీ నరసింహారావు అత్యధిక భాషలు వచ్చిన ప్రధానమంత్రి. ఆయనకు 14 భాషలు వచ్చు. ఏక సంథాగ్రాహి. ఏదైనా నేర్చుకోగలగిన వరం పొందిన కారణజన్ముడు. తన రంగం ఇది అంటూ ఆయన ఆగిపోలేదు. ఆయన నిర్వర్తంచిన ప్రతి పోస్టు ప్రజలకు ఉపయోగపడేలా మలిచారు. ఆయన తీసుకున్నన్ని సంచలన నిర్ణయాలు ఎవరూ తీసుకోలేదు.
వాటిలో కొన్ని –
— 1948 నుంచి ఐదేళ్ల పాటు కాకతీయ వారపత్రికను నడిపారు. వంద గొప్ప తెలుగు కథల్లో ఆయన రాసిన ‘గొల్ల రామవ్వ‘ కథ ఒకటి.
— విశ్వనాథ సత్యానారాయణ గొప్ప రచన ‘వేయిపడగలు‘ స్వయంగా హిందీలోకి అనువదించారు. దానిపేరు సహస్ర ఫణ్.
— ఆయనకు 14 భాషలు వచ్చు.. వాటిలో విదేశీ భాషలు.. అరబిక్, స్పానిష్, ఫ్రెంచ్, పర్షియన్, ఇంగ్లిష్.
— తెలుగు అకాడమీ స్థాపించింది ఆయనే.
— కళశాలల్లో ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉండేది. పీవీ వచ్చాక తెలుగు మీడియం ప్రవేశ పెట్టారు.
— ఆయన 10 వేల గ్రంథాలు సేకరించారు. వాటిని చదివారు.
— తన మామిడితో తోటలో మోటారు సతాయిస్తుంటే స్వయంగా దానిని తీసి పరిశీలించి సరిచేశారు. అంతేకాదు, మీ మోటారులో లోపాలున్నయని కిర్లోస్కర్ కంపెనీకి లేఖ రాస్తే వారు ఆశ్చర్యపోయి దానిని సరిచేసి తిరిగి కృతజ్జత లేఖ పంపారు.
— పీవీ సీఎం అయ్యాక తీసుకున్న అతిపెద్ద నిర్ణయం భూసంస్కరణలే. తన 1000 ఎకరాలు దానమిచ్చారు.
— గ్రామీణాభివృద్ధి శాఖకు బడ్జెట్లు పెంచింది తొలుత పీవీనే.
— దేశాన్ని అణ్వస్త్ర శక్తిగా మార్చింది పీవీనే. వాజ్ పేయి 1998లో తొలి అణుపరీక్షలు జరపగా పీవీ పునాదులు, వేసి అన్ని సదుపాయాల సమకూర్చడం వల్లే మేం చేయగలిగాం అని వాజ్ పేయి స్వయంగా ఆ క్రెడిట్ ను పీవీకి ఇచ్చారు.
— ఒకప్పుడు మన దేశానికి సోవియట్ యూనియన్ తో మైత్రి ఉండేది. అది 15 ముక్కలు కావడంతో అమెరికాతో స్నేహం అవసరం అని గుర్తించారు. అందుకు పీవీ ఎంచుకున్న మార్గం… అమెరికా బాగా ఇష్టపడే ఇజ్రాయిల్ తో ఫ్రెండ్షిప్ చేయడం. ఇజ్రాయిల్ కి దగ్గరై మెల్లగా అమెరికాకు దగ్గరయ్యారు. ఈరోజు మనం చైనా మీద మీసం మెలేస్తున్నాం అంటే దానికి కారణం… ఇజ్రాయిల్ మనవైపు ఉండటమే. ఆర్మీ పరంగా మోస్ట్ బ్రిలియంట్ అండ్ పవర్ ఫుల్ కంట్రీ ఇజ్రాయిల్.
— పీవీ ప్రధానిగా ఉన్నపుడు పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో 2004లో ఆయన చనిపోయినపుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఢిల్లీలో అంతక్రియలు కూడా జరగనివ్వలేదు. దీంతో హైదరాబాదుకు తీసుకొచ్చి అంత్యక్రియలు జరిపారు. అందుకే కేసీఆర్ కాంగ్రెస్ ను మరింత ఏడిపించడానికి ఈ శత జయంతి ఉత్సవాలను ఘనంగా చేస్తున్నారు.
— స్టాక్ మార్కెట్లను కంట్రోల్ చేసే సెబీని చట్టబద్ధం చేసి అధికారాలిచ్చారు.
— లెసెన్స్ రాజ్ ను తొలగించి పెట్టుబడుల వరద వచ్చేలా చేశారు.
— ప్రైవేటు బ్యాంకులు పీవీ పుణ్యమే. వడ్డీ రేట్ల మార్చుకునే అవకాశాన్ని బ్యాంకులకు ఇచ్చింది కూడా పీవీనే.
— కుర్తాళం పీఠాధిపతి అవ్వాల్సిన సమయంలో రాజీవ్ గాంధీ హత్య వల్ల ప్రధాని అయ్యారు.