జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. జగన్ దిగిన హెలిప్యాడ్ దగ్గరకు మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలు వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. కొందరు చోటా మోటా నేతలు కూడా వెళ్ళారు. అయితే కేంద్ర మాజీమంత్రిగా పనిచేసిన డాక్టర్ కిల్లి కృపారాణి పేరు మాత్రం ప్రోటోకాల్ జాబితాలో నుండి మయమైపోయిందట. అందుకనే హెలిప్యాడ్ దగ్గరకు వెళ్ళేందుకు అనుమతిలేదని పోలీసులు స్పష్టంగా చెప్పేశారు.
తనకు అవమానం జరిగిందని మండిపోయిన కిల్లి అక్కడినుండి వెళ్ళిపోయారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎంఎల్ఏ ధర్మాన కృష్ణదాస్ ఆమెను సముదాయించేందుకు ప్రయత్నించినా వినకుండా ఆమె వెళ్ళిపోయారు. సరే ఇలాంటి ప్రోటోకాల్ వివాదాలు నడుస్తునే ఉంటాయి కాబట్టి వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరంలేదు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేంద్రంలో మంత్రిగా పనిచేసిన కిల్లికి ఉన్న స్టేచర్ ఏమిటో బయటపడింది. చోటా మోటా నేతలు కూడా హ్యాపీగా సీఎం హెలికాప్టర్ దగ్గరకు వెళ్ళి రిసీవ్ చేసుకోగలిగినపుడు కిల్లిని మాత్రమే పోలీసులు ఎందుకు అనుమతించలేదు. శ్రీకాకుళం ఎంపీగా, కేంద్రంలో మంత్రిగా పనిచేసిన కిల్లి మామూలు నేతకాదు కదా. అయినా పోలీసులు ఆపేశారంటే ఆమెకు స్టేచర్ లేదనే అర్ధమవుతోంది.
మామూలుగా అయితే ఇలాంటి వాళ్ళకి ప్రోటోకాల్ లో పేరుందా లేదా అని పోలీసులు చూడరు. కేంద్ర మాజీమంత్రి అందులోను అధికారపార్టీ నేత కాబట్టి అడ్డుచెప్పకుండా వదిలేస్తారు. అయినా సరే పోలీసులు ఆపేశారంటేనే ఆమెకున్న స్టేచర్ ఏమిటో అర్ధమైపోతోంది. ఏదో కాంగ్రెస్ గాలిలో గెలిచిపోయి అదృష్టం కొద్ది మంత్రయిపోయారు. నియోజకవర్గంలో పట్టులేదు, కార్యకర్తల బలం లేదు. అయినా సరే తనను తాను చాలా పెద్ద నేతగా చెప్పుకుంటుంటారు.
ఇక్కడే ఆమెతో సమస్య వస్తోంది. పార్టీలో చేరింది కూడా చాలా ఆలస్యంగా చేరారు. అలాంటిది చేరిన వెంటనే శ్రీకాకుళం లోక్ సభ టికెట్ కావాలని పట్టుబట్టారు. ఇవ్వకపోయేటప్పటికి ఈమధ్య రాజ్యసభ కావాలని అడిగారు. ముందు జనాల్లో పట్టుపెంచుకుంటే అన్నీ అవే వస్తాయి కాని ప్రోటోకాల్ వివాదాన్ని పెద్దది చేసుకుంటే ఏటొస్తది ?
This post was last modified on June 28, 2022 9:24 pm
వైసీపీ అధినేత జగన్ ఆయన పార్టీ తరఫున విజయం దక్కించుకున్న మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సమావేశాలకు…
రెండు రోజుల క్రితం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ నయనతార విడుదల చేసిన…
ప్రజాయుద్ధ నౌక.. ప్రముఖ గాయకుడు గద్దర్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని గౌరవం ఇచ్చింది. గద్దర్ కుమార్తె, విద్యావంతురాలు వెన్నెలను…
దక్షిణాదిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే తమన్ పేరు తట్టకపోవచ్చు కానీ.. తన చేతిలో ఉన్నప్రాజెక్టుల లిస్టు చూస్తే…
వైసీపీ హయాంలో సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి…