రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వచ్చి.. మూడేళ్లు అయింది. ఇది ఏ ప్రబుత్వానికైనా.. చాలా మెజారిటీ కాలం. అయితే.. అనూహ్యంగా జగన్‌కు ఇబ్బందికర పరిణామం ఎదురైంది. కరోనా రావడంతో రెండేళ్ల కాలం కాలగర్భంలో కలిసిపోయింది. దీంతో అభివృద్ధి చేసేందుకు.. పెట్టుబడులు తెచ్చేందుకు కొంత ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యాయనేది వాస్తవం. అయితే.. ఈ విషయాన్ని ప్రొజెక్టు చేసుకుని.. ప్రజలను తమ వైపు తిప్పుకోవడంలో వైసీపీ నాయకులు విఫలమయ్యారు.
ఎందుకంటే.. ఇప్పుడు ఎక్కడా ఈ మాటే వినిపించడం లేదు. మేం అంతిచ్చాం.. ఇంతిచ్చాం.. అని చెబుతున్నారు. అయితే.. సంక్షేమం అందున్న వారు.. ఓకే. వారు మౌనంగా ఉన్నారు. కానీ, అందని వారే ఎక్కు వ మంది ఉన్నారు. వీరూ కూడా మౌనంగా ఉంటున్నారు. దీంతో మంత్రులు, సర్కారు చెబుతున్న వాదన బలంగా వెల్లడం లేదు. అదే సమయంలో విపక్షాలు చేస్తున్న అభివృద్ధి లేదనే వాదన బలంగా వెళ్లింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల వాదనను పక్కన పెట్టేలా.. అసలు ఏం జరిగింది! అనే విషయాలను వైసీపీ నాయకులు వినిపించలేక పోయారు.
దీంతో అభివృద్ధి చేయని పార్టీగా. వైసీపీ నిలిచిపోయింది. ఇక, ఇప్పుడు జగన్ ముందు రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. ఈ రెండేళ్లలో ఏం చేస్తారు? ఎలా చేస్తారు? ఏ విధంగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు? అనేది ఆసక్తిగామారింది. మూడు రాజధానుల నిర్మాణాలను ముందుకు తీసుకువెళ్తారా? అమరావతినే అభివృద్ది చేస్తారా? పోలవరం పరిస్థితి ఏంటి? వెనుకబడిన జిల్లాలను ఎలా అబివృద్ధి చేస్తారు? అనే ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు.
ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. ఇప్పుడు మాత్రం ఎన్నికల మూడ్ వచ్చేసింది. ప్రజలు కూడా తమకు ప్రయోజనం ఉన్న ప్రభుత్వం కావాలనే కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. వైసీపీ సర్కా రు ఇప్పటి వరకు ఏమీ చేయలేదనే బావన ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. దీనికితోడు రాష్ట్రంలో రహదారులు గుంతలు పడడం.. వాటిని కూడా పూడ్చుకోలేక పోవడం వంటివి పెద్ద ఎత్తున ప్రబుత్వానికి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే రెండేళ్ల పాటు అయినా.. అభివృద్ధిపై దృష్టి పెట్టాలని వైసీపీ నాయకులే కోరుతుండడం గమనార్హం. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి. ఇంకా పంపకాలే అంటారో.. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారో చూడాలి.
This post was last modified on June 28, 2022 10:37 am
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…