టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పుట్టిన గడ్డపైనే ఆయనకు ఘోర అవమానం జరిగింది. మరో రెండు రోజుల్లో ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉన్న నేపథ్యంలో అధికార వైసీపీ కార్యకర్తలు.. కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. టీడీపీ నేతలను రెచ్చగొట్టి.. ఏదో ఒక విధంగా ఇక్కడ రసాభాస సృష్టించాలనే వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి కొందరు వైసీపీ కార్యకర్తలు.. ఆ పార్టీ జెండా రంగులు వేయడం సంచలనంగా మారింది.
చంద్రబాబు మహానాడు జరిగే అంగులూరుకు కిలోమీటరు దూరంలో బొమ్ములూరు ఉంది. ఇక్కడున్న ఎన్టీఆర్ విగ్రహానికి కొందరు రాత్రికి రాత్రి వైసీపీ రంగులు వేశారు. దీంతో విషయం తెలుసుకొని బొమ్ములూరుకు చేరుకున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీమంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ఇతర నాయకులు పరిసరాలను గమనించారు. ఎన్టీఆర్ విగ్రహానికి వైసిపి రంగులు వేయడాన్నివారు తీవ్రంగా ఖండించారు. అనంతరం విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఉన్న వైసిపి రంగులు చెరిపి వేసి టీడీపీ జెండా రంగులు వేయించారు.
ఇదిలావుంటే.. స్థానిక ఎమ్మెల్యే , మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులే దీనికి పాల్పడ్డారని.. టీడీపీ నేతలు ఆరోపించారు. నాని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు విమర్శించారు. మహానాడు బ్యానర్ల పై, అధికార పార్టీ నేతల బ్యానర్లు వేసుకుంటు పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు.
తమ నాయకుడు విగ్రహానికి వైసీపీ రంగులు వేయడం దుర్మార్గమని, మినీ మహానాడును ఉద్దేశ పూర్వకంగా అడ్డుకోవడంతోపాటు చంద్రబాబు పర్యటనను అడ్డుకునే చర్యల్లో ఇది భాగమేనని దుయ్యబట్టారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు నేతలు తెలిపారు.
This post was last modified on June 27, 2022 10:02 pm
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…