Political News

బాబుకు వార్నింగ్ బెల్స్‌..!

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ త‌ర‌చుగా చెబుతున్న మాట‌.. త‌మ‌కు ఓటు బ్యాంకు పెరుగుతోంద‌ని. అంతేకాదు .. ఇంకేముంది.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. వైసీపీ ముఠా మొత్తం.. మునిగిపోతుంద‌ని.! ఇక‌, ప్ర‌జల్లోనూ చంద్ర‌బాబు చెబుతున్న మాట‌… ఈ ప్ర‌భుత్వంపై తిర‌గ‌బ‌డాల‌ని.. ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను అవలంబిస్తున్న జ‌గ‌న్‌ను ఇంటికి పంపించాల‌ని. అయితే.. ఈ విష‌యాలు ఎలా ఉన్నా.. టీడీపీ ఓటు బ్యాంకు కూడా వైసీపీ వైపు మ‌ళ్లుతున్న సంకేతాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

తాజాగా జ‌రిగిన ఆత్మకూరు ఉప ఎన్నిక‌లో వైసీపీ భారీ ఎత్తున పుంజుకుంది. నిజానికి 2019 ఎన్నిక‌ల్లో ఈ పార్టీ ఓటు బ్యాంకు 52.42 శాతంగా ఉంది. అదేస‌మ‌యంలో 82.4 శాతం ఓటింగ్ జ‌రిగింది. అంటే.. భారీ ఎత్తున ప్ర‌జ‌లు త‌ర‌లి వ‌చ్చి.. ఓట్లేసినా.. వైసీపీకి 52 శాతమే ఓట్లు వ‌చ్చాయి. మిగిలిన వాళ్లంతా కూడా టీడీపీ లేదా.. ఇత‌ర పార్టీలు అనుకోవాలి. కాని.. ఇప్పుడు మాత్రం ఈ ఓటు షేరు.. వైసీపీకి 72.24 కు చేరింది. అంటే.. గ‌త ఎన్నిక‌ల‌తో పోల్చితే.. 20 శాతం పైగానే ఉంది.

పైగా తాజాగా జ‌రిగిన ఉప ఎన్నిక‌లో పోలింగ్ కేంద్రాల‌కు వ‌చ్చి క్యూలో నిల‌బ‌డి ఓట్లేసిన‌.. వారు 64.2 శాతం మాత్ర‌మే. అంటే.. ఓటింగ్‌కు ప్ర‌జ‌లు భారీ ఎత్తున క‌దిలి రాలేదు. కానీ, ఇంత‌ త‌క్కువ మంది ఓటింగ్ ప్ర‌క్రియ‌లో పాల్గొన్నా.. ఎక్కువ మొత్తంలో అంటే.. 82,888 ఓట్ల మెజారిటీ వైసీపీకి ల‌భించింది. పైగా పెరిగిన 20 శాతం ఓటింగ్‌లో 19.5 శాతం వైసీపీకే ప‌డింద‌ని అంచ‌నా ఉంది. మ‌రి త‌క్కువ మందే వ‌చ్చారు.. కానీ, ఎక్కువ ఓట్లు ప‌డ్డాయి!

దీనిని బ‌ట్టి.. టీడీపీ అనుకూల‌.. సానుకూల మ‌ద్ద‌తుదారులుగా ఉన్న వారు.. కూడా వైసీపీకే గుద్దేశారా? అనేది సందేహాల‌కు దారితీస్తున్న విష‌యం. మ‌రి చంద్ర‌బాబు చెబుతున్న వ్య‌తిరేక‌త ఎక్క‌డ‌కు పోయినట్టు? అంతేకాదు.. జ‌గ‌న్ చేస్తున్న తుగ్ల‌క్ ప‌నుల‌ను ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేదా(చంద్ర‌బాబు భాష‌).. అంటే.. ఇదే ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల‌ను డిఫెన్స్‌లోకి నెట్టేసిన ప‌రిణామం. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు అధికారంలోకి రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు.

కానీ, ఎన్ని విధాల ప్ర‌య‌త్నం చేసినా.. ఎక్క‌డా వైసీపీని ఢీ కొట్టి గెలిచేలా.. ప‌రిస్థితి టీడీపీ కి అనుకూలంగా లేద‌ని స్ప‌ష్టం అవుతోందని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికిప్పుడు.. చంద్ర‌బాబు త‌న వ్యూహాన్ని మార్చుకుని.. పార్టీని.. ముందుకు తీసుకువెళ్తే త‌ప్ప‌. ఈ మార్పులో మార్పు రాద‌ని అంటున్నారు. మూస విధానాలు.. స‌ర్కారును విమ‌ర్శించ‌డం.. వంటివి త‌గ్గించి.. తాము అధికారంలోకి వ‌స్తే.. ఏం చేస్తామ‌నే విష‌యాన్ని వివ‌రించిన‌ప్పుడే ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతా రోచూడాలి.

This post was last modified on June 27, 2022 6:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago