ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని చేర్చుకోవటంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంచి దూకుడు మీద ఉన్నాడు. వచ్చే ఏప్రిల్, మేనలలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని, జూన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవటం ఖాయమన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలను రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరటానికి చాలామంది నేతలు ఆసక్తిగా ఉన్నారన్నారు.
ముఖ్యంగా కేసీయార్ ఒంటెత్తు పోకడలు నచ్చని చాలామంది టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు బాగా ఉత్సాహం చూపిస్తున్నట్లు చెప్పారు. రేవంత్ ప్రధానంగా ఒకపుడు కాంగ్రెస్ లో పనిచేసి తర్వాత టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయిన నేతలను తిరిగి పార్టీలోకి రప్పించేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు. ఇదే క్రమంలో బీజేపీలోకి వెళ్ళిపోయిన కొందరు నేతలు కూడా తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. అంటే ఏకకాలంలో ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీలో నుండి నేతలను కాంగ్రెస్ లోకి రేవంత్ లాగేస్తున్నారు.
ఇదే సమయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నుండి నేతలను లాగేసుకునేందుకు బీజేపీ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వివిధ జిల్లాల్లో పై రెండు పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలపైన కమలం పార్టీ దృష్టిపెట్టింది. ఎవరికి అవకాశముంటే వాళ్ళని పార్టీలోకి లాగేసుకోవటమే టార్గెట్ గా బీజేపీ చీఫ్ బండి సంజయ్ పావులు కదుపుతున్నారు. వివిధ పార్టీల్లోని గట్టి నేతలను లాగేసుకుంటే కానీ బీజేపీకి వచ్చే ఎన్నికల్లో చాలాచోట్ల అభ్యర్ధులు దొరకరు. కానీ కాంగ్రెస్ పరిస్ధితి అలాకాదు. చాలా నియోజకవర్గాల్లో పార్టీ తరపున పోటీ చేయటానికి గట్టి అభ్యర్ధులే ఉన్నారు.
కాకపోతే పార్టీలోని నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు, టీఆర్ఎస్ కు మద్దతుగా కోవర్టులుగా పనిచేసే నేతలు ఎక్కువగా ఉండటం వల్లే చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్ధులు ఓడిపోతున్నారు. దీనికి విరుగుడుగా రేవంత్ కోవర్టులను ఏరేసే పనిని పెట్టుకున్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక చాలా జాగ్రత్తగా ఉంటుందని చెబుతున్నారు. ఏదేమైనా రేవంత్ అయితే మంచి దూకుడుమీద వెళుతున్నారు.
This post was last modified on June 27, 2022 2:33 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…