నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో.. దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచీ.. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రత్యర్థులపై పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించారు. మొత్తంగా 20 రౌండ్లు లెక్కింపు కొనసాగగా.. ప్రతి రౌండ్‌లోనూ విక్రమ్‌రెడ్డి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగారు.
ఆది నుంచీ ఆధిక్యంలో కొనసాగిన విక్రమ్ రెడ్డి.. 15 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి 76,096 (పోలైన మొత్తం ఓట్లలో 50 శాతానికిపైగా) ఓట్లు దక్కించుకోవడంతో.. విజయం ఏకపక్షమని తేలిపోయింది. పోస్టల్ బ్యాలెట్ సహా 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత.. ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్ యాదవ్‌పై 82,888 ఓట్ల మెజారిటీతో విక్రమ్ రెడ్డి గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. ఈ
23న జరిగిన ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. బీజేపీ సహా మొత్తం 13 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేశారు. అయితే.. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,13,338 కాగా.. కేవలం 1,37,081 (64 శాతం) మంది మాత్రమే ఓటు వేశారు. అయితే.. వేసిన ఓట్లలో లక్ష ఓట్లు పైగా.. విక్రమ్ ఖాతాలో పడడంతో గౌతంరెడ్డి సెంటిమెంటు బాగానేపనిచేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు..
మొత్తం 20 రౌండ్లలో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు..
వైసీపీ : 1,02,074
బీజేపీ : 19,332
బీఎస్పీ : 4,897
నోటా : 4,197
పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ఫలితాలు ఇలా..
మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు : 217
వైసీపీ : 167
బీజేపీ : 21
బీఎస్పీ : 7
ఇతరులు : 10
తిరస్కరించినవి : 9
నోటా : 3
This post was last modified on June 26, 2022 1:12 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…