బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీ గిరిజన నాయకురాలు, మాజీ గవర్నర్.. మాజీ మంత్రి.. ఒడిసాకు చెందిన ద్రౌపది ముర్మును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆమె గెలుపు నల్లేరుపై నడకే అవుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయితే.. ద్రౌపది ఎంపికపై వివాదాలకు కేరాఫ్‌గా ఉన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. చేసిన ట్వీట్ .. రాజకీయ కాక రేపింది. “రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది. అయితే.. పాండవులు ఎవరు? కౌరవులు ఎవరు?” అని వర్మ సంచలన ట్వీట్ చేశారు.
దీనిపై బీజేపీ నాయకులు నిప్పులు చెరిగారు. ఏపీ, తెలంగాణలోని బీజేపీ నాయకులు వర్మపై విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ముపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలపై బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మ ట్వీట్‌ను సుమోటొగా తీసుకుని పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వర్మలాగా ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే ముందు వర్మని జైలుకి పంపాలన్నారు. అలాగే వర్మను మానసిక వైద్యుడి చూపించాల్సిన అవసరం ఉందన్నారు.
అదేవిధంగా తెలంగాణలోని ఘోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘ఆర్జీవీని వేస్ట్ ఫెలో’ అన్నారు. రాంగోపాల్ వర్మ మందు తాగి ట్వీట్స్ చేస్తారని ఫైర్ అయ్యారు. ఆర్జీవీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వార్తల్లో ఉండేందుకు వర్మ ప్రయత్నాలు చేస్తుంటారని, ద్రౌపది ముర్ముపై వర్మ ట్వీట్‌ను ఖండిస్తున్నామన్నారు. ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నికకానున్న సమయంలో వర్మ ట్వీట్ బాధాకరమని రాజాసింగ్ చెప్పుకొచ్చారు.
కేసు.. నమోదు..
వర్మ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటు రాంగోపాల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జీవీని వేస్ట్ ఫెలోతో పోల్చారు. ఆర్జీవీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నికకానున్న సమయంలో వర్మ ట్వీట్ బాధాకరమన్నారు. కాగా.. వర్మ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. కించపర్చడం తన ఉద్దేశం కాదన్నారు. అయినా.. రాజకీయంగా మాత్రం వర్మ రేపిన వివాదం ఎక్కడా ఆగకపోవడం గమనార్హం.
This post was last modified on June 24, 2022 7:55 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…