నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి గురువారం జరిగిన ఉప ఎన్నిక… అనేక చిత్ర విచిత్రాలకు నిల యంగా మారింది. ఓవైపు.. సింపతీ ఓట్లను తన వైపు తిప్పుకొనేందుకు అధికార పార్టీ వైసీపీ ప్రయత్నాలు చే స్తున్నా.. ఎక్కడో బెడిసికొట్టిన నేపథ్యంలో దొంగ ఓట్ల పర్వానికి తెరదీసిందని.. బీజేపీ నాయకులు విమర్శిస్తు న్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికల్లో మర్రిపాడు మండలం డీసీపల్లిలో దొంగ ఓట్లు కలకలం రేపాయి.
బీజేపీ అభ్యర్థి పోలింగ్ కేంద్రం పరిశీలనకు వచ్చిన సమయంలో.. దొంగ ఓట్లు వేస్తున్న మహిళలను గుర్తించారు. బీజేపీ అభ్యర్థిని చూసిన మహిళలు వెంటనే సచివాలయంలోకి పరిగెత్తారు. వారిని అనుసరించి సచివాలయంలోకి వెళ్లగా.. వైసీపీ నేతలు అతనితో వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని.. ఇరువర్గాల వారికి నచ్చజెప్పారు. దొంగ ఓట్ల వ్యవహారంపై అధికారులకు బీజేపీ అభ్యర్థి ఫిర్యాదు చేశారు.
మరోవైపు… పోలింగ్ సందర్భంగా అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని బీజేపీ నేతలు ఆరోపించారు. మర్రిపాడు మండలం కృష్ణాపురం పోలింగ్ కేంద్రంలో బీజేపీ ఏజెంట్ విష్ణుని కిడ్నాప్ చేసేందుకు పలువురు యత్నించారు. కారులో తీసుకెళ్తున్న ఏజెంట్ను బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్ తిమ్మనాయుడుపేట వద్ద గుర్తించి రక్షించారు. ఆ సమయంలో బీజేపీ, వైసీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది.
ఈ విషయాన్ని జిల్లా ఎస్పీతో పాటు ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు బీజేపీ నేతలు చెప్పారు. ఏజెంట్‌ను వైఈపీ నాయకులే కిడ్నాప్ చేసేందుకు యత్నించారని ఆరోపించారు. పడమటి నాయుడుపల్లి పోలింగ్ కేంద్రం వద్ద గుంపులు గుంపులుగా ఉన్న వైసీపీ నాయకుల విషయం కూడా బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఏదేమనా.. సింపతీ పొలిటికల్ ఫైట్ జరుగుతున్న ఉప ఎన్నికలోనూ.. అధికార పార్టీ ఇలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి.
This post was last modified on June 24, 2022 7:31 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…