రాష్ట్రపతి ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. బీజేపీయేతర కూటమి పార్టీలు.. ఏకంగా 17 పార్టీలకు చెందిన నాయకులు.. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను రంగంలోకి దింపాయి. ఇక బీజేపీ కూటమి పార్టీలు.. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ద్రౌపదీ ముర్మును ఎంపిక చేశాయి. ప్రస్తుతం బీజేపీకి 48.6 శాతం ఓటు బ్యాంకు ఉంది. ఇక, బీజేపీ అభ్యర్థి గెలిచేందుకు కేవలం 2 శాతం ఓట్లు ఉంటే సరిపోతుంది. అయినప్పటికీ.. ప్రతిపక్షాలు మాత్రం అభ్యర్థిని ప్రకటించాయి.
ఇక, విషయం ఏంటంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటు వైపు ఉంటారు? ఏం చేస్తారు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మోడీకి వ్యతిరేకంగా కేంద్రంలో చక్రంతిప్పాలని అనుకున్న కేసీఆర్.. అనుకున్న విధంగా ముందుకు సాగలేకపోతున్నారు. ఎందుకంటే.. బీజేపీ, మోడీ వ్యతిరేక పార్టీలన్నీ కూడా.. కాంగ్రెస్‌ను పక్కన పెట్టాలనేది కేసీఆర్ ఆలోచన. కానీ కాంగ్రెస్ లేకుండా.. అసలు ప్రత్యామ్నాయ కూటమే లేదన్నది.. తృణమూల్ సహా ఎన్సీపీ.. వంటి పార్టీల అభిప్రాయం.
ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ను కలుపుకొనే.. వారు తమ కూటమి రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించారు. అందుకే.. అప్పట్లోనే కేసీఆర్.. ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. కాంగ్రెస్ ఉండే కూటమిలో తాము ఉండలేమని.. ఆయన చెప్పక పోయినా.. పరోక్షంగా ఆయన వేస్తున్న అడుగులు మాత్రం అలానే ఉన్నాయి. కట్ చేస్తే.. కేసీఆర్ లేకుండానే.. ఉమ్మడి విపక్షాల అభ్యర్థి యశ్వంత్ రంగంలోకి దిగిపోయారు. ఈ క్రమంలో త్వరలోనే ఆయన ప్రచారానికి కూడా దిగనున్నారని తెలుస్తోంది.
మరి ఇప్పుడు కేసీఆర్.. యశ్వంత్‌కు మద్దతు తెలుపుతారా? లేక.. తటస్థంగా ఉంటారా? అనేది ఆసక్తిగా మారింది. తటస్థంగా ఉండి.. యశ్వంత్‌కు మద్దతు తెలపని పక్షంలో బీజేపీ అభ్యర్థి ముర్ము.. విజయం నల్లేరుపై నడకే అవుతుందని అంటున్నారు. పరోక్షంగా బీజేపీకి కేసీఆర్ సహకరించారనే వాదన మరింత బలంగా వినిపిస్తుంది. ఇది రాబోయే రాష్ట్ర ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది.
అలాకాకుండా.. విపక్షాల అభ్యర్థికి మద్దతు తెలిపితే.. కాంగ్రెస్ కూటమి పక్షంపై ఇప్పటి వరకు బింకంగా ఉన్నకేసీఆర్ రాజకీయం సడలిపోతుంది. ఇది కూడా రాష్ట్రంలో కేసీఆర్ ప్రతిష్టపై.. ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు. ఇన్ని పరిణామాల మధ్య కేసీఆర్.. ఏం చేస్తారు? ఈ గట్టునుంటారా? లేక ఆ గట్టుకెళ్తారా? అనే కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఏం చేసినా.. కేసీఆర్ వేసుకున్న చిక్కుముళ్లు ఆయనకే తిప్పలుగా మారాయని చెబుతున్నారు.
This post was last modified on June 22, 2022 4:55 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…