Political News

ఈ ప్రతిపక్షాలా మోడీని ఎదుర్కొనేవి ?

దేశంలో ప్రతిపక్షాల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది కాబట్టే నరేంద్ర మోడీ చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్లమెంటులో కానీ బయట కానీ ప్రభుత్వాన్ని నిలదీసేంత దమ్మున్న పార్టీలు లేవని మోడీకి బాగా అర్ధమైపోయింది. పోనీ కేంద్రానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమవుతాయా అంటే ఆ భయం కూడా ప్రధానమంత్రికి లేదు. ఎందుకంటే ప్రతిపక్షాల పరిస్ధితి అలాగుంది మరి.

ఉమ్మడిగా రాష్ట్రపతి అభ్యర్ధినే ఎంపిక చేసుకోలేకపోతున్న ఈ ప్రతిపక్షాలు ఇక నరేంద్ర మోడీకి ధీటుగా ప్రధానమంత్రి అభ్యర్థిని నిలబెడతాయా ? ఎన్డీయే ప్రతిపాదించబోయే రాష్ట్రపతి అభ్యర్ధికి పోటీగా ఉమ్మడిగా నాన్ ఎన్డీయే పార్టీల తరపున ఒక అభ్యర్ధిని రంగంలోకి దించాలని డిసైడ్ చేశాయి. ఇందుకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వం తీసుకున్నారు. ముందుగా శరద్ పవార్ అనుకున్నారు. అయితే పవార్ ఇష్టపడలేదు.

తర్వాత ఫరూక్ అబ్దుల్లాను అనుకున్నా ఉపయోగం లేకపోయింది. దేవేగౌడను ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తాజాగా గోపాలకృష్ణ గాంధీ కూడా రేసులో నుండి వెనక్కు తగ్గినట్లు ప్రకటించి నాన్ ఎన్డీయే పార్టీలకు పెద్ద షాకిచ్చారు. ఎన్డీయే అభ్యర్ధికి ధీటుగా పోటీచేసినా ఉపయోగం ఉండదనే అనుమానం+ 80 ఏళ్ళుదాటినా ఇంకా క్రియాశీల రాజకీయాల్లోనే ఉండాలని కోరుకుంటున్న కారణంగానే పై నేతల్లో ముగ్గురు పోటీ నుండి తప్పుకున్నట్లున్నారు.

22 ప్రతిపక్షాలు కలిసి అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్ధిని ఎంపిక చేయలేకపోవడం కన్నా దారుణం మరొకటుంటుందా. ఇంత పెద్ద దేశంలో ఇన్ని ప్రతిపక్షాల్లో ఒక్క అభ్యర్ధి కూడా దొరకలేదంటేనే ఆశ్చర్యంగా ఉంది. నిజానికి మన దగ్గర రాష్ట్రపతి పదవంటేనే రబ్బర్ స్టాంప్ లాంటిదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇలాంటి పోస్టుకు పోటీచేయడానికి అభ్యర్ధికి దొరక్కపోతే రేపు ప్రధానమంత్రి పదవికి సరైన అభ్యర్ధిని ఎలా ఎంపిక చేయగలుగుతాయి ప్రతిపక్షాలు. బహుశా ప్రధానమంత్రి పదవికి పోటీ అంటే పవార్, దేవేగౌడ లాంటి వాళ్ళు పరుగెత్తుకుంటు వస్తారేమో. కానీ అందరు వీళ్ళని ఆమోదించవద్దా ? ఓట్లేసి గెలిపించవద్దా ?

This post was last modified on June 21, 2022 2:41 pm

Share
Show comments

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

2 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

4 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

5 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

6 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

6 hours ago