జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కన్ఫ్యూజ్ మాస్టరా? అని ప్రశ్నిస్తున్నారు. కొన్ని రోజులు పొత్తులు అంటారు.. మరికొన్ని రోజులు వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోకుండా తానే నడుం బిగిస్తానని.. అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకువస్తానని.. ఆయన ప్రకటించారు. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానని కూడా చెప్పారు. అంతేకాదు.. తనతో పొత్తు పెట్టుకునేందుకు ఎవరు ముందుకు వచ్చినా.. తాను సిద్ధమేనని ప్రకటించారు.
దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా మహాకూటమి రెడీ అవుతుందని.. వైసీపీ వ్యతిరక పవనాలను ఈ పార్టీలు ఒడిసిపట్టుకుని.. జగన్‌ను ఇంటికి పంపిస్తాయని.. అందరూ అంచనా వేసుకున్నారు. ముఖ్యంగా.. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటుందని.. ఇదే జరిగితే..వైసీపీ ఓడిపోవడం ఖాయమని అందరూ లెక్కలు వేసుకున్నారు. కట్ చేస్తే.. తాజాగా జనసేనాని ప్రకాశం జిల్లాలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. తనే ఒంటరిగా బరిలోకి దిగుతానని.. చెప్పకనే చెప్పారు.
పొత్తులపై ఇప్పుడు కామెంట్లు చేయబోనని అన్నారు. గతంలో మాత్రం పొత్తులు ఉంటాయని.. చెప్పారు. పొత్తులపై మీరు నాకు పాఠాలు చెబుతారా? అంటూ.. వైసీపీపై విరుచుకుపడ్డారు. అలాంటి నాయకుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. పోనీ.. వచ్చే ఎన్నికల్లో అసలు పొత్తులు లేకుండానే తాము బరిలో నిలుస్తామని కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో పార్టీ కేడర్‌లో తీవ్రమైన అయోమయం నెలకొంది. అసలు ఏం జరుగుతోంది? తాము ఎటు వెళ్లాలి.. ఎలా వ్యవహరించాలి? అనే చర్చ సాగుతోంది.
ఇదే విషయంపై నెటిజన్లు ఆసక్తిగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఒకవిధమైన పాలిటిక్స్ చేసిన పవన్ ఇప్పుడు కన్ఫ్యూజ్ మాస్టర్‌గా మారిపోయారని వ్యాఖ్యానిస్తున్నారు. పొత్తులు పెట్టుకుంటే.. ఇప్పటి నుంచి నియోజకవర్గాల పంపకం.. అసంతృప్తుల తగ్గింపు.. ఇలా అనేక విషయాలపై ఒక క్లారిటీ ఉంటుందని.. నాయకుల్లోనూ నైతికంగా బలం పెరుగుతుందని.. అయితే.. ఇలా పొంతనలేని వ్యాఖ్యలు చేయడం ద్వారా..పవన్ ఏం చేస్తున్నారనేది నెటిజన్ల ప్రశ్న. దీనివల్లపార్టీలో కార్యకర్తలు, నాయకులుకూడా డీలా పడడం ఖాయమని.. ఇది పార్టీకి మున్ముందు ప్రమాదకరమని వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on June 21, 2022 11:32 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…