YS Jagan Mohan Reddy
వరుస అరెస్టులతో టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు యువ ముఖ్యమంత్రి వైఎస్.జగన్. ఆ విధంగా ధూళిపాళ నరేంద్రను అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా అనుమర్లపూడి చెరువు వద్ద నరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్న వార్త ఒకటి వచ్చింది. అక్కడి తెలుగుదేశం పార్టీ అప్రమత్తం అయిపోయింది. పొన్నూరు నియోజకవర్గంలో మట్టి మాఫియా జరుగుతోందని ఆరోపిస్తూ టీడీపీ నేతలు ఛలో అనుమర్లపూడికి పిలుపునిచ్చిన నేపథ్యాన ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు అత్యంత అమానవీయ ధోరణిలో ధూళిపాళ నరేంద్రను అరెస్టు చేశారు. దీనిపై లోకేశ్ స్పందించారు. అధినేత చంద్రబాబు కూడా స్పందించారు.
మరోవైపు ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం పిలుపు మేరకు ఛలో నర్సీపట్నం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది కూడా చాలా వివాదాలకు తావిచ్చింది. పోలీసుల చర్యలతో అక్కడి ప్రాంతం అట్టుడిగి పోయింది.అసలు నేతలెవ్వరూ అక్కడికి చేరుకోకుండా చేశారు.
ఇక ఇదే సమయంలో జగన్ ప్రభుత్వం నడుచుకుంటున్న తీరుపై అనేక విమర్శలు రావడానికి కారణం ఇక్కడ పోలీసులు నడుచుకుంటున్న తీరే ! ఆ రోజు జగన్ చేపట్టిన పాదయాత్రను మేం అడ్డుకుని ఉంటే ఇంత జరిగేదా? అని కూడా అయ్యన్న కొడుకు విజయ్ ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ నేతలు అంతా అరెస్టులలో ఉన్నారు. కొందరు గృహ నిర్బంధంలో ఉన్నారు.
వంగలపూడి అనిత అనే లీడర్ ఇంటి చుట్టూ ఇవాళ ఉదయం పోలీసులు ఉన్నారు. ఆఖరికి ఆమె తిరుగుబాటు చేసి, పోలీసులను నిలదీసి అక్కడి నుంచి పంపితే కానీ వాళ్లు వెళ్లలేదు. తనకు 41 ఏ ప్రకారం నోటీసులు ఇస్తేనే తనను గృహ నిర్బంధం చేయాలని ఆమె పట్టుబట్టారు. ఇదే విషయమై పోలీసు ఉన్నతాధికారులతో ఆమె ఫోన్లో మాట్లాడారు ఆ వీడియోను ట్విటర్ లో పోస్టు చేశారు. ఇదే విధంగా అన్ని చోట్లా ఇవాళ టీడీపీ తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లను అదేవిధంగా అవమానాలనూ ఎదుర్కొంది.ఇదే ఇప్పుడు వైఎస్ జగన్ ను ఇరకాటంలో పెడుతోందని తెలుస్తోంది.
This post was last modified on June 21, 2022 10:21 am
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…