Political News

బాబు న‌డిస్తే చాల‌దు… నేత‌ల‌ను న‌డిపించాలిగా…!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ‌య‌సు 70+ కానీ, ఆయ‌న మాత్రం 20+ మాదిరిగా జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. వైసీపీ నేత‌లకు స‌వాళ్లు రువ్వుతున్నారు. గ‌తంలో కూడా లేని ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ఇది మంచి ప‌రిణామ‌మే. చంద్ర‌బాబుపై ఉన్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేదే. అయితే.. చంద్ర‌బాబు ఒక‌వైపే చూస్తున్నార‌నేది విశ్లేష‌కుల మాట‌. తాను మాత్ర‌మే న‌డిస్తే.. పార్టీలో జోష్ పెర‌గ‌ద‌ని అంటున్నారు. త‌ను ఎంచుకున్న ల‌క్ష్యాన్ని మ‌రింత బ‌లంగా ముందు నాయ‌కుల్లో తీసుకురావాల‌ని అంటున్నారు.

“2019 ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ.. చంద్ర‌బాబు వ‌న్ మ్యాన్ షో చేశారు. అప్ప‌ట్లోనూ..త‌నే అన్నీ అయి ప్ర‌చారం చేశారు. నిజానికి చంద్ర‌బాబుపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఏమీలేదు. ఆయ‌న ప‌ట్ల ఇప్ప‌టికీ .. విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా ప్ర‌జ‌ల్లో మంచి పేరుంది. ఆయ‌న‌కు అధికారం ఇవ్వాల‌నే అనుకుంటున్నారు. కానీ, ఎటొచ్చీ.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల ప‌రిస్థితిపైనే చ‌ర్చ సాగుతోంది. వైసీపీ మాదిరిగా.. టీడీపీ వ్య‌క్తిగ‌త రాజ‌కీయాలు చేసేందుకు అవ‌కాశం లేదు” అని విశ్లేష‌కులు చెబుతున్నారు.

2019 ఎన్నిక‌ల్లో వైసీపీ రాజ‌కీయం వ్య‌క్తిని బ‌ట్టి న‌డిచింది. కేవ‌లం జ‌గ‌న్‌ను చూసి ప్ర‌జ‌లు ఓట్లేశారు. ఆయ‌న‌ను న‌మ్మారు. నాయకులు ఎవ‌రు బ‌రిలో ఉన్నార‌నేది చూడ‌కుండానే.. జ‌గ‌న్‌ను చూసి ఓటేశారు. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. జగ‌నే స్వ‌యంగా.. మీరు బ‌ల‌పడండి.. మీరే పార్టీని గెలిపించాలి.. అని నాయ‌కుల‌కు చెబుతున్నారు. అంటే.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు బలం పుంజుకోవాల‌నేది జ‌గ‌న్ చెబుతున్న మాట‌. ఇదే విష‌యాన్ని టీడీపీలో చెప్పాల‌నేది విశ్లేష‌కుల మాట‌.

చంద్ర‌బాబుపై ప్ర‌జ‌ల్లో మంచి అభిప్రాయ‌మే ఉంది. అయితే.. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌తో క‌నెక్ట్ అయ్యే నాయ‌కులు కావాల‌ని.. గ‌త ఎన్నిక‌ల‌ను తీసుకుంటే.. ఒక‌టి రెండు త‌ప్ప‌.. 23 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. ప్ర‌జ‌ల‌తో క‌నెక్ట్ అయిన నాయ‌కులకే ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌ని అంటున్నారు. ఇదే త‌ర‌హా వ్యూహాలు అనుస‌రించాలి .. త‌ప్ప‌.. కేవ‌లం త‌ను ప్ర‌చారం చేసుకుని వెళ్లిపోయి.. ఓట్లు వేయాల‌ని అంటే.. సాధ్య‌మేనా? అని సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. అంటే.. చంద్ర‌బాబు ఒక్క‌రే కాకుండా.. నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ బ‌ల‌మైన నాయ‌కుల‌ను త‌యారు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు.

This post was last modified on June 21, 2022 11:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

43 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago