ఎండ, వాన పట్టకుండా ఉంటున్నారు. అబ్బా! ఇంటికి పొండి మీకు సెలవులు ఇచ్చేస్తాం అని కేసీఆర్ అంటూ ఉంటే పట్టించుకోకుండా అక్కడే ఉండిపోతున్నారు ఆ బిడ్డలు. నిరసనకు ఓ కొత్త నిర్వచనం చెబుతున్న ఈ బిడ్డలు తాము అనుకున్నవి సాధించే వరకూ తరగతి గదుల్లోకి తొంగి చూడం అని అంటున్నారు. ఇది కదా ! కావాలి..బాసర విద్యార్థులు (ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అని రాయాలి) దేశానికే ఒక కొత్త మార్గం చూపుతున్నారు. ఆందోళనల్లో కొత్త అధ్యాయం ఇది. అస్సలు ఎవ్వరూ మాట్లాడరు.. ఎవ్వరూ అదే పనిగా అరవరు.. తామేం చెప్పాలనుకుంటున్నామో అవి మాత్రమే ఇప్పటికే చెప్పి ఊరుకున్నారు.
సబితమ్మ (విద్యాశాఖ మంత్రి) ఇవన్నీ సిల్లీ డిమాండ్లు అన్నా నవ్వి ఊరుకున్నారే కానీ నోరేసుకుని పడిపోలేదు. మంచి విద్యను కోరుకోవడం మా బిడ్డల హక్కు అని తల్లిదండ్రులు అంతా గొంతెత్తుతున్నారు. ఇది చూసి మొన్నటి అగ్నిపథ్ ఆందోళనకారులు నేర్చుకోవాలి. కవిత్వం రాస్తూ, పాటలు పాడుతూ తమ ఆందోళనలకు మరో సృజన రూపం ఇస్తూ ట్విటర్ వేదికగా తమ గోడు చెప్పుకుంటున్నారే కానీ ఎక్కడా సర్కారును ఆడిపోసుకోవడం లేదు. నిరసనలు చూసి దేశం నివ్వెర పోతోంది అని అంటే అది నిజంగానే వారి గొప్పతనం. అదే వారి సంయమనానికి ప్రతీక.
12 డిమాండ్లు.. మాకో వీసీ కావాలి. పార్ట్ టైం కాదు ఫుల్ టైం..మాకు కనీస వసతులు కావాలి.. అలానే ల్యాప్ ట్యాప్ లు కావాలి.. మేం చదువుకుంటా ఫుల్ టైం మాతో పాటే ఉంటే అధ్యాపకులు కావాలి..వీటితోపాటు కనీస అవసరాలు తీర్చండి చాలు..మంచి భోజనం పెట్టండి చాలు..అని అడుగుతున్నారు.. ఆరో రోజు అత్యంత శాంతియుత పంథాలో వీరంతా నిరసన చేస్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చే దాకా తాము కదలబోం అని చెబుతున్నారు.
ఈ బిడ్డలున్న చోట పోలీసులు ఉన్నా వారు కూడా ఏం చేయలేకపోతున్నారు. అదనపు బలగాలు వచ్చినా చేసేందుకు ఏమీలేక మిన్నకుండిపోతున్నాయి. ఈ దేశంలో హక్కులను సాధించుకునే పద్ధతి ఇది అని రాకేశ్ టికాయత్ లాంటి ఆందోళనకారులకు సైతం పాఠాలు చెబుతున్నారు వీరు.. ఇది కదా ! కావాలి. అందుకే పిల్లలూ మీకు జేజేలు అని పదే పదే తల్లిదండ్రులతో పాటు సామాజిక కార్యకర్తలు కూడా అంటున్నారు. ఇప్పుడు పట్టించుకోవాల్సింది.. పరిష్కరించాల్సింది కేసీఆర్ సర్ మాత్రమే!
This post was last modified on June 20, 2022 12:49 pm
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…
ముందో విడుదల తేదీ అనుకుని పోటీ వల్ల వెనుకడుగు వేసి ఇప్పుడు కొత్త డేట్ పట్టుకునేందుకు కిందా మీద పడుతున్న…
https://youtu.be/zHiKFSBO_JE?si=HDSpx4GNEhcOje0y కొత్త సంవత్సరం తొలి ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ జనవరి 10 విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరి…
టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మలు ఓ…