జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. బాపట్ల జిల్లాలో పర్యటించిన పవన్.. గత మూడేళ్లలో ఈ జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతుల కుటుంబాలను పరామర్శించారు. ఆయా కుటుంబాలకు రూ. లక్ష చొప్పున పరిహారం అందించారు. అనంతరం.. జనసేన ఆధ్వర్యంలో పరుచూరులో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తులు పెట్టుకుంటామనేది.. ఇప్పుడే చెప్పబోనని అన్నారు.
తమకు ప్రజలతోనే పొత్తులు ఉంటాయని పవన్ అన్నారు. అక్రమాలు, లంచగొండి తనాలకు జనసేన దూరంగా ఉంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికలలో పొత్తులు ప్రజలతోనే ఉంటాయని చెప్పారు. ప్రజలతో కలిసి ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపైనే తాను ఆలోచిస్తున్నట్టు పవన్ అన్నారు. జనసేనను ఒక్కసారి ఆశీర్వదించి.. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని.. ప్రజలకు పవన్ పిలుపుని చ్చారు. ఒక్కసారి జనసేనను ఆశీర్వదించండి.. రాష్ట్రాన్ని బాగు చేసి చూపిస్తాం
అని పవన్ పిలుపునిచ్చారు.
వైసీపీ ఎమ్మెల్యేలు.. ఇష్టాను సారం వ్యవహరిస్తున్నారని.. పవన్ నిప్పులు చెరిగారు. అధికారం ఇచ్చారు కదా.. ఐదేళ్ల వరకు మమ్మల్ని ఎవరూ ఏమీ పీకలేరు.. అన్నట్టుగా.. వారు వ్యవహరిస్తున్నారని.. విమర్శించారు. అందుకే.. ప్రజాస్వామ్యంలో తమకు నచ్చని.. తమకు పనులు చేయని.. దౌర్జన్యాలు చేసే ఎమ్మెల్యేలను రీకాల్ చేసేలా మార్పులు జరగాల్సి ఉందని.. పవన్ వ్యాఖ్యానించారు. దసరా తర్వాత.. ప్రజల్లోకి వస్తామని చెప్పిన.. పవన్.. ఇంటింటికీ తిరిగే పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నట్టు చెప్పారు.
వైసీపీ సర్కారు వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు. మేం నిలబడతాం.. మమ్మల్ని ఆశీర్వదించండి!
అని పవన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో ప్రజల కోసమే.. టీడీపీ సహా ప్రధాని మోడీ, బీజేపీలతోనూ విభేదించినట్టు పవన్ వెల్లడించారు. ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం నెరవేర్చలేక పోయిందని పవన్ దుయ్యబట్టారు. ప్రజల నమ్మకాన్ని వైసీపీ పాలకులు కోల్పోయారని విమర్శించారు. వైసీపీ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. 2014లోనే తాను వచ్చి ఉంటే.. రాష్ట్రం పరిస్థితి ఇలా ఉండేది కాదని పవన్ వ్యాఖ్యానించారు.
This post was last modified on June 19, 2022 8:48 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…