Kangana Ranaut
సైన్యంలో నియామకాల కోసం కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారు కొత్తగా తెచ్చిన ‘అగ్నిపథ్’పై ఆర్మీ అభ్యర్థులు చేస్తున్న దేశవ్యాప్త ఆందోళనలపై ప్రముఖ బాలీవుడ్ నటి, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పం దించింది. కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీంకు కంగనా మద్దతు తెలిపింది. ఇలాంటి ఒక పథకానికి శ్రీకారం చుట్టినందుకు కేంద్రాన్ని అభినందిస్తున్నట్లు ఆమె తన ఇన్‌స్టాగ్రాం స్టేటస్‌లో పేర్కొంది.
ఇజ్రాయెల్ లాంటి చాలా దేశాల్లో అక్కడి యువతకు సైన్యంలో శిక్షణను ఆయా దేశాలు తప్పనిసరి చేశాయని కంగనా తెలిపింది. కొన్నేళ్లు ప్రతీ ఒక్కరూ ఆర్మీలో పనిచేయడం ద్వారా జీవితంలో ఎలా విలువలతో జీవించాలో తెలుసుకుంటారని, క్రమశిక్షణ, జాతీయత భావం.. దేశ సరిహద్దుల్లో ఉంటూ దేశాన్ని రక్షించడం ఎలాగో తెలుసుకుంటారని ఆమె చెప్పింది.
కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీంలో కూడా ఎంతో లోతైన అర్థం ఉందని, ఈ స్కీం ఏదో డబ్బు సంపాదనకో, భవిష్యత్‌ను నిర్మించుకోవడానికో, ఉపాధి కల్పనకో కాదని కంగనా చెప్పుకొచ్చింది. అప్పటి రోజుల్లో ప్రతీ ఒక్కరూ గురుకులానికి వెళ్లేవారని.. ఈ ‘అగ్నిపథ్’ కూడా అలాంటిదేనని ఆమె తన పోస్ట్‌లో పేర్కొంది. డ్రగ్స్, పబ్జీ లాంటి వాటికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్న యువత శాతం షాక్‌కు గురిచేస్తోందని పేర్కొంది.
ఇలాంటి సంస్కరణలు కచ్చితంగా అవసరమేనని కంగనా అభిప్రాయపడింది. ‘అగ్నిపథ్’ లాంటి స్కీంను తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని కంగనా తన ఇన్‌స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది. కంగనా అభిప్రాయాన్ని ఒక్కమాటలో చెప్పాలంటే కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీంను ఆమె సంప్రదాయ గురుకుల విధానంతో పోల్చడం గమనార్హం.
This post was last modified on June 19, 2022 3:14 pm
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…