Political News

మ‌హిళ‌ల‌కు జ‌గ‌న్‌.. మొండిచేయి.. 50 ఏళ్లు దాటితేనే.. ఈ సాయం

ఏపీలో మ‌హిళ‌ల‌కు అన్ని రూపాల్లోనూ సాయం చేస్తున్న ప్ర‌భుత్వం త‌మ‌దేన‌ని ప‌దే ప‌దే చెబుతున్న జ‌గ‌న్ స‌ర్కారు.. తాజాగా మ‌హిళ‌ల‌కు.. ముఖ్యంగా ఎలాంటి ఆధారం లేని.. ఒంట‌రి మ‌హిళ‌ల‌కు.. మొండి చేయి చూపించింది. వైఎస్‌ఆర్‌ పింఛను కానుక పథకం కింద ఒంటరి మహిళలకు, భర్త నుంచి విడిపోయిన, వివాహం కాని స్త్రీలకు ఇచ్చే పింఛను అర్హత వయసును ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు 35 ఏళ్లు దాటిన ఒంటరి మహిళలకు పింఛను ఇస్తుండగా ఇకపై కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి 50 ఏళ్లు దాటితేనే సాయాన్ని అందిస్తామని స్పష్టం చేసింది.

భర్తను వదిలి/భర్త వదిలేసి కనీసం ఏడాది గడిచిన తర్వాతే పింఛనుకు అర్హత ఉంటుందని వెల్లడించింది. ఆమె ఒంటరిగా ఉంటున్నట్లు తగిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు స‌ర్కారు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. అవివాహిత మహిళల పింఛను అర్హత వయసును సైతం ప్రభుత్వం పెంచింది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లోని అవివాహిత మహిళలకు 30 ఏళ్లకే పింఛను మంజూరు చేస్తుండగా ఆ వయసును కూడా 50 ఏళ్లు చేసింది.

పట్టణ ప్రాంతాల్లోని అవివాహిత మహిళల అర్హత వయసును సైతం 35 ఏళ్లనుంచి 50 ఏళ్లకు పెంచింది. అవివాహిత మహిళలకు కుటుంబం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకూడదనే నిబంధన పెట్టింది. అంతేకాకుండా పెళ్లి కాలేదనే ధ్రువీకరణ పత్రాన్ని స్థానిక తహసీల్దారు నుంచి తీసుకొని సమర్పించాలని స్పష్టం చేసింది. . రాష్ట్రవ్యాప్తంగా ఒంటరి మహిళల విభాగంలో 1,88,062 మంది పింఛను తీసుకుంటున్నారు. వీరికి నెలకు రూ.2,500 చొప్పున ప్రభుత్వం ఇస్తోంది.

ప్రస్తుతం ప్రభుత్వం 6 నెలలకొకసారి పింఛను మంజూరు విధానాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగా జులై 1వ తేదీన కొత్త పింఛన్లను అందిస్తామని ప్రకటించింది. ఇప్పటికే పాత నిబంధన ప్రకారం చాలా మంది పింఛను కోసం ఒంటరి మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. తాజా ఉత్తర్వులు వీటికి వర్తింపజేస్తే వీరు పింఛన్లు కోల్పోయే అవకాశం ఉంది. మ‌రి దీనిని బ‌ట్టి జ‌గ‌న‌న్న మ‌హిళ‌ల‌కు చేస్తున్న మేలేమిటో ఇట్టే అర్ధ‌మ‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on June 18, 2022 12:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago