ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు మేమే అమ్ముతాం... వసూళ్ల సొమ్ము నేరుగా మా నిర్వహణలోని ఖాతాకే చేరుతుంది. తర్వాత అందులో సర్వీసు చార్జీ మినహాయించుకుని మిగతా మొత్తాన్ని మీ ఖాతాల్లో వేస్తాం. దీనికి తప్పనిసరిగా అంగీకరిస్తూ ఒప్పందం చేసుకోవాల్సిందే. కాదంటే మీ లైసెన్సు రద్దవుతుంది ఇదీ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చేసిన స్పష్టమై న ప్రతిపాదన. థియేటర్ల యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం జారీచేస్తున్న హుకుం అని కూడా అంటున్నారు.
థియేటర్ యజమానుల మెడపై కత్తి పెట్టి మరీ ఇలా ఒత్తిడి చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఆన్‌లైన్ లో సినిమా టికెట్ల విక్రయాన్ని తప్పనిసరి చేస్తూ ఈ నెల 2న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 30 రోజుల్లోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్‌టీవీటీడీసీ)తో ఒప్పందం కుదుర్చుకోవాలని పేర్కొంది. ఇప్పటికే ఒప్పందపత్రాలను (ఎంవోయూ) థియేటర్ల యాజమాన్యాలకు పంపించింది.
వాటిలో నియమ నిబంధనలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న ఎగ్జిబిటర్లు.. స్పష్టత రానిదే ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ససేమిరా అంటున్నారు. గడువులోగా ఒప్పందం చేసుకోకపోతే లైసెన్సు రద్దు చేస్తా మంటూ అధికారులు ఎగ్జిబిటర్లపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో వారిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే అంశంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీఎం జగన్‌కు తాజాగా లేఖ రాసింది.
‘టికెట్ల విక్రయాలను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా చేపట్టాలి. ఆ లింక్‌ను ఏపీఎస్ఎఫ్‌టీవీ టీడీసీకి అందజేస్తాం. తద్వారా ఆన్‌లైన్ టికెట్ల ఆదాయం, థియేటర్ ఆక్యుపెన్సీ లాంటివి ఎప్పటికప్పుడు తెలుస్తాయి. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని ఆ లేఖలో వివరించారు. మరి సర్కారు మాత్రం ఒంటెత్తు పోకడలు పోతోంది. దీనిపై ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on June 17, 2022 4:55 pm
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…
సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…