సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. దీనిని నిరుద్యోగ సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనంగా ఆయన అభివర్ణించారు. నాడు రైతులతో పెట్టుకున్నారని.. నేడు జవాన్‌లతో పెట్టుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీపై ఆయన సటైర్లు వేశారు. ఇదేనా మీ పాలన! అంటూ.. నిప్పులు చెరిగారు.
‘అగ్నివీర్ స్కీమ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మక నిరసనలు దేశంలోని నిరుద్యోగ సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనం. తొలుత దేశంలో రైతులతో పెట్టుకున్నారు. ఇప్పుడు దేశంలోని జవాన్ అభ్యర్థులతో పెట్టుకుంటున్నారు. వన్ ర్యాంక్ – వన్ పెన్షన్ నుంచి ప్రతిపాదిత నో ర్యాంక్ – నో పెన్షన్ వరకు!’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కేటీఆర్ ట్వీట్‌కు జోరుగా లైకులు పడుతున్నాయి.
అగ్నిపథ్’ స్కీమ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భగ్గుమంది. తొలుత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెలుపల ఉన్న బస్సులను ఆర్మీ ఉద్యోగాల కోసం కొన్నేళ్లుగా నిరీక్షిస్తూ.. శిక్షణ కూడా తీసుకుంటున్న అభ్యర్థులు ధ్వంసం చేశారు. అక్కడికి పోలీసులు చేరడంతో పరుగు పరుగున రైల్వే స్టేషన్‌లోకి వెళ్లి అక్కడి రైళ్లను ధ్వంసం చేశారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను నామరూపాల్లేకుండా చేశారు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు కూడా చూస్తూ ఉండిపోయారు. అనంతరం బలగాలను రప్పించుకుని ఆందోళకారులపైకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా పదుల సంఖ్యలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
This post was last modified on June 17, 2022 4:52 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…