వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపు నాదే! అని పక్కా ధీమా వ్యక్తం చేస్తున్న వైసీపీ నాయకుల్లో మంత్రి రోజా ముందు వరుసలో నిలుస్తున్నారట. అదేంటి? అంటే.. ‘అదంతా టీడీపీ చలవేనని’ ఆమె సెలవిస్తున్నారు. తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు దక్కించుకున్న రోజాకు పొరుగు పార్టీలు.. ప్రతిపక్ష పార్టీల కంటే.. కూడా సొంత పార్టీ వైసీపీ నుంచే తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎందుకంటే.. గ్రూపు రాజకీయాలు ఆమెను ఒకరకంగా.. నానా ఇబ్బందికీ గురి చేశాయి.
ఒకానొక దశలో ప్రవిలేజ్ కమీటి చైర్మన్ కాకాని గోవర్ధన్‌రెడ్డి దగ్గరకు వచ్చి.. కన్నీరు పెట్టుకున్న పరిస్థితి కూడా వచ్చింది. అలాంటి పరిస్థితి నుంచి ప్రస్తుతం మంత్రి అయ్యారు. అయితే.. మంత్రి అయినా కూడా.. ఆమెకు థ్రెట్ పోలేదు. ఇప్పటికీ.. రోజాకు వ్యతిరేకంగా అంతర్గత కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి. మరో సీనియర్ మంత్రి అనుచరుడిగా ముద్ర ఉన్న కేజే కుమార్.. ఇక్కడ చక్రం తిప్పుతూనే ఉన్నారు. ఇదిలావుంటే.. ఈ వ్యతిరేకత ఎలా ఉన్నా.. తన గెలుపును ఎవరూ ఆప లేరనేది రోజా మాట.
దీనికి ప్రధాన కారణం.. కీలకమైన ప్రతిపక్షం టీడీపీ తరఫున ఇక్కడ పోటీ చేస్తారని భావిస్తున్న మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ తనయుడు.. గాలి భాను ప్రకాష్‌నాయుడుకు సొంత పార్టీలోనే గ్రూపు రాజకీయాలు ఏర్పడి.. ఇంకా చెప్పాలంటే.. సొంత కుటుంబంలోనే ఏర్పడిన కుంపటి.. ఇంకా చల్లారలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ టికెట్‌ను దక్కించుకునేందుకు.. సినీ నటి వాణివిశ్వనాథ్ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో టీడీపీకిఅనుకూలంగా వ్యవహరించిన ఆమెకు ఈ టికెట్ ఇవ్వలేదు.
దీంతో అలిగి దూరమయ్యారు. ఇటీవల మళ్లీ తెరమీదకి వచ్చిన వాణీ విశ్వనాథ్.. నగరి టికెట్ ఎవరు ఇస్తే.. ఆ పార్టీతరఫున పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ విషయంలో వాణీకి కొందరు.. టీడీపీ నాయకులే సహాయం చేస్తున్నారనే గుసగుస వినిపిస్తోంది. రోజా దూకుడును.. గాలి భాను ప్రకాష్ అయితే.. అడ్డుకోలేరని.. అందుకే.. ఆయన ప్లేస్‌లో వాణీని తీసుకురావాలని.. కొందరు ప్రతిపాదిస్తున్నారు. ఇది ప్రస్తుతం నగరి నియోజకవర్గం టీడీపీలో కాక రేపుతోంది. ఈప రిణామాలతో పుంజుకుంటుందని భావిస్తున్న టీడీపీలో కలకలం రేగి.. తనకు ఇబ్బందులు తప్పిస్తున్నాయని.. రోజా భావిస్తున్నారట. ఇదీ.. సంగతి!!
This post was last modified on June 15, 2022 10:03 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…