Political News

ప్లీనరీలో కీలక నిర్ణయం వెల్లడించనున్న జగన్

వ‌చ్చే నెల ఎనిమిది, తొమ్మిది తారీఖుల్లో జ‌రిగే వైఎస్సార్సీపీ ప్లీన‌రీ సంద‌ర్భంగా జ‌గ‌న్ ఓ కీల‌క నిర్ణ‌యం వెలువ‌రించాల‌నుకుంటున్నారట. ఈ నిర్ణ‌యం కార‌ణంగా వ‌చ్చే సారి ఎన్నిక‌ల‌కు పోటీచేసే అభ్య‌ర్థుల జాబితాను ఆరు నెలల ముందు కానీ లేదా ప‌ది నెల‌ల ముందు కానీ ప్ర‌క‌టించే అవ‌కాశాల‌ను పరిశీలిస్తూ సంబంధిత విష‌య‌మై ఓ స్ప‌ష్ట‌మ‌యిన ప్ర‌క‌ట‌న చేసేందుకు సిద్ధం అవుతున్నారు. గ‌తంలోనూ ఇదే విధంగా ఆయ‌న ప‌నిచేసిన దాఖ‌లాలు ఉన్నాయి.

తాజా నిర్ణ‌యాల‌కు అనుగుణంగా లేదా విరుద్ధంగా అయినా అభ్య‌ర్థుల జాబితా అన్న‌ది ప్లీన‌రీ సమ‌యానికే ప్రాథ‌మికంగా సిద్ధం అయిపోయినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఎందుకంటే వైసీపీకి పొత్తుల గోల లేదు. వైసీపీకి సంబంధించి ఇత‌రుల జోక్యం అంటూ ఉండ‌దు. ఓ విధంగా ఆ పార్టీకి నంబ‌ర్ 2 అంటూ ఎవ్వ‌రూ లేరు. ఉండ‌రు కూడా ! అని గ‌తంలోనే తేలిపోయింది. ఇదే మాట స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి అనే ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ఎప్పుడో చెప్పేశారు. క‌నుక ప్ర‌జ‌ల్లో కాస్తో,కూస్తో విశ్వ‌సనీయ‌త ఉన్న‌వారికే టిక్కెట్లు అన్న‌ది మ‌రోసారి రుజువు చేసేందుకు వైఎస్ జ‌గ‌న్ సిద్ధం అవుతున్నారు.

అంతేకాకుండా నియోజ‌కవ‌ర్గ ఇంఛార్జులుగా ఉన్నా కూడా, వారంద‌రికీ ఎమ్మెల్యే టిక్కెట్లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ద‌క్కవు. అక్క‌డ పనితీరే ప్రామాణికం. ఈ సారి కూడా కొన్ని స్థానాల‌కు గాను కొత్త ముఖాల‌నే ప‌రిచ‌యం చేసి ఓ ప్ర‌యోగం చేయాల‌ని సీఎం భావిస్తున్నారు. వీలున్నంత వ‌ర‌కూ తెలంగాణ‌లో అమ‌లు అవుతున్న ఫార్ములానే ఇక్క‌డా ఎప్లై చేయ‌నున్నారు పీకే ప్ర‌తినిధి రిషి. అంటే అక్క‌డ కూడా సిట్టింగుల‌ను త‌ప్పించేయాల‌ని చెప్పిన విధంగానే, ఇక్క‌డ కూడా చాలా మంది సిట్టింగుల‌కు ముచ్చెమ‌ట‌లు పోయించేలా ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా సిద్ధం అయ్యాయి అని తెలుస్తోంది.

స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు అధికారం ద‌క్కాక ఎలా ప‌నిచేస్తున్నారో చెప్పాల‌ని, ఈ విష‌య‌మై త‌న‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించ‌వ‌ద్ద‌ని ప‌దే, ప‌దే పోలీసు అధికారులను కోరుతున్నారు. సీఎం జ‌గ‌న్ చెప్పిన విధంగా తెర‌పైకి కొత్త ముఖాల వెలుగు అన్న‌ది రావ‌డం ఖాయం. అదేవిధంగా ముందే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేక వారితో జిల్లా పార్టీ అధ్య‌క్షులు ప‌నిచేసే విధంగా ప్ర‌ణాళిక‌లు కూడా సిద్ధం చేస్తున్నారు. ఎలానూ జీరో రిజ‌ల్ట్ వ‌చ్చిన వారు ఇంటికే ప‌రిమితం అవుతాం అనుకుంటే కుద‌ర‌ని ప‌ని అని కూడా సీఎం తేల్చేశారు. ఇదే ఇప్పుడు టీడీపీని కూడా పున‌రాలోచ‌న‌లో ప‌డేసింది. ముందే అభ్య‌ర్థుల‌ను చెప్పి టీడీపీ, జ‌న‌సేన, బీజేపీల‌కు కూడా కొన్ని స‌వాళ్లు ఎదురు కానున్నాయ‌ని తెలుస్తోంది.

This post was last modified on June 15, 2022 12:12 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ప్రభాస్ ప్రభావం – కమల్ వెనుకడుగు

ప్యాన్ ఇండియా సినిమాల వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. జూన్ 13 విడుదలను లాక్ చేసుకుని ఆ మేరకు తమిళనాడు…

10 hours ago

ట్రెండ్ సెట్టర్ రవిప్రకాష్.! మళ్ళీ మొదలైన హవా.!

సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ గురించి తెలుగు నాట తెలియనివారెవరు.? మీడియాకి సంబంధించి ‘సీఈవో’ అన్న పదానికి పెర్‌ఫెక్ట్ నిర్వచనంగా రవిప్రకాష్…

10 hours ago

శ్యామల పొలిటికల్ కథలు.! ఛీటింగ్ సినిమా.!

బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం శ్యామల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల…

10 hours ago

బీఆర్ఎస్‌కూ కావాలొక వ్యూహ‌క‌ర్త‌

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌నే క‌ల‌లు గ‌న్న…

15 hours ago

అద్దం పంపిస్తా.. ముఖం చూసుకో అన్న‌య్యా..

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత‌, సొంత అన్న‌పై ఆమె తీవ్ర‌స్థాయిలో యుద్ధం…

16 hours ago

ఎన్టీఆర్ పుట్టిన రోజుకు సర్ప్రైజ్

పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్‌డేట్స్…

16 hours ago