కొన్ని విషయాలు ఎక్కడి నుంచి ఎక్కడికి దారితీస్తాయో ఊహించడం కష్టం. సాధారణంగా ఏపీలో జగన్ ని తిట్టడానికి బహిరంగంగా చాలామంది ధైర్యం చేయరు. అలా ధైర్యం చేసిన కొందరు చాలా ఇబ్బంది పడిన సందర్భాలున్నాయి. అయితే, వెంకాయమ్మ అనే మహిళ జగన్ సర్కారు గురించి చేసిన విమర్శలు వైరల్ అయ్యాయి. ఎప్పటిలాగే ఆమెను కొందరు ఇబ్బంది పెట్టడం చేశారు. కానీ వెంకాయమ్మ అదరలేదు బెదరలేదు. టీడీపీ ఆమెకు మద్దతుగా నిలబడింది. దీంతో తెలుగు రాజకీయాల్లో చర్చకు తావిస్తున్న వెంకాయమ్మ అనే దళిత మహిళ కు (ఉమ్మడి గుంటూరు నివాసి) టాపిక్ కొత్త టర్న్ తీసుకుంది.
టీడీపీ అధిష్టానం ఎంట్రీతో … ఆమెను ఏమైనా చేస్తే వైసీపీకే నష్టం అని భావించిన వైసీపీ యు టర్న్ తీసుకుని వెంకాయమ్మకు ఇల్లిచ్చేది మేమే అని కొత్త మాట అంటోంది. డ్యామేజ్ కంట్రల్లో భాగంగా జగన్ త్వరలోనే ఆమెకు గిఫ్ట్ ఇవ్వనున్నారని జగన్ తరఫున వైసీపీ సోషల్ వింగ్ ఓ హామీ కూడా ఇచ్చింది. గత ప్రభుత్వం వల్ల కానిది తమ వల్లే ఎందుకు అవుతుందో కూడా గణాంకాలతో సహా వివరిస్తూ వస్తోంది.
వెంకాయమ్మ విషయంలో ఇంత టర్న్ కు కారణం ఏంటంటే… తాజాగా టీడీపీ విడుదల చేసిన పోస్టరే. బెంగళూరు, హైద్రాబాద్, తాడేపల్లి తదితర ప్రాంతాలలో విలాస వంతం అయిన ఇళ్లు ఉన్న జగన్ ఎందుకని పేదలకు ముఖ్యంగా వెంకాయమ్మలాంటి దళితులకు (అర్హత ఉన్న నిరుపేద దళితులకు) ఇల్లు ఇవ్వలేకపోతోందని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ ఓ పోస్టర్ విడుదల చేసింది. దీనిపైనే ఇప్పుడు వాదోపవాదాలు నడుస్తున్నాయి.
ఊరికో ప్యాలెస్ కట్టుకుని.. ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకుని, పూరి గుడిసెలో ఉండే వెంకాయమ్మ లాంటి సామాన్య మహిళ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేక, దాడులు చేపిస్తావా జగన్ రెడ్డి ? అని టీడీపీ నిలదీసింది. ఆ పోస్టరు వైరల్ అయ్యింది. వెంకాయమ్మ గురించి అందరికీ తెలిసిపోయింది. దీంతో వైసీపీ రూటు మార్చేసింది. టీడీపీ వల్ల కానిది వైసీపీ వల్లే సాధ్యం అవుతుందని బల్ల గుద్ది మరీ చెప్పే ప్రయత్నం చేస్తోంది.
14 ఏళ్ల తెలుగుదేశం పాలనతో ఆమెకు ఇల్లు రాలేదని… కానీ మూడేళ్లు జగన్ పాలనతో తప్పక సాధ్యం అవుతుందని వైసీపీ వర్గాలు కొత్త పాట పాడుతున్నాయి. టీడీపీ చేపట్టిన ఛలో కంతేరు కార్యక్రమాన్ని అడుగడుగునా అడ్డుకున్న విమర్శలు పాలయినా కూడా వైసీపీ ఈ వివాదాన్ని తమకు అనుకూలంగామార్చుకోగలమని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది. తమ ప్రభుత్వం ఎందరినో ఎన్నో విధాలుగా ఆదుకుందని కనుక వెంకాయమ్మకు కూడా ఆదుకుంటుందని అంటోంది సోషల్ మీడియా వింగ్ చెబుతోంది. ఒక సామాన్యురాలి విషయంలో రెండు బలమైన పార్టీలు చర్చ పెట్టుకోవడం… ఒక అరుదైన విషయం. మరి ఈ గొడవ వల్ల అయినా ఆమెకు ఇల్లు వస్తుందేమో చూద్దాం.
This post was last modified on June 15, 2022 11:14 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…