తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్న విషయం తెలి సిందే. ఇప్పటికే ఆయన జాతీయస్థాయిలో పార్టీ స్థాపనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదేసమయంలో భారత రాష్ట్రసమితి(బీఆర్ ఎస్) పేరుతో ఒక పార్టీని ప్రారంభించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే.. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పొలిటికల్ లీడర్లు ఎలా రియాక్ట్ అయ్యారు.. అవు తున్నారు.. అనే విషయాలు పక్కన పెడితే.. సాధారణ ప్రజల టాక్ ఏంటి? అనేది ఆసక్తిగా మారింది.
లీడర్ల మాట ఎలా ఉన్నప్పటికీ.. ప్రజల అభిప్రాయాలే నేతలకు కీలకం. ఎందుకంటే.. రేపు ఓటేసి గెలిపిం చేది వారే కాబట్టి. గతంలో పీవీ నరసింహారావు.. ఎన్టీఆర్.. ఇలా కొందరు జాతీయ రాజకీయాల్లో తెలుగు నేల నుంచి చక్రం తిప్పిన వారు ఉన్నారు. వారి విషయంలో ప్రజల నుంచి ఒక అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగు వారు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం రావడంపై అప్పట్లో గొప్పగానే చర్చించుకున్నారు. ఇక, ఇన్నాళ్ల తర్వాత తెలంగాణ నుంచి కేసీఆర్ ఇలా దూకుడు ప్రదర్శించడం.. ఆసక్తిగానే ఉంది.
అయితే.. ఈ విషయంలో ఎందుకో.. గతంలో ప్రజల నుంచి ఉన్న రెస్పాన్స్.. ఇప్పుడు కేసీఆర్ విషయం లో కనిపించడం లేదు. పైగా రెండు కీలక విషయాలపై నెటిజన్లు.. తీవ్రమైన కామెంట్లు చేస్తున్నారు. ఏపీ నుంచి కానీ, తెలంగాణలోని ఉమ్మడి రాష్ట్ర వాదన వినిపించే ఓ వర్గం ప్రజల నుంచి కానీ.. ఈ మాటలు వినిపిస్తున్నారు.. “తోటి తెలుగువారని దొంగలని తిట్టి అధికారంలోకి వచ్చిన వ్యక్తి, దేశంలోని అందరినీ సమానంగా ఎలా చూస్తాడు???” అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు.
దీనికి దాదాపు వందల సంఖ్యలోనే అనుకూల కామెంట్లు రావడం గమనార్హం. ఇక, మరో నెటిజన్.. “రాష్ట్ర విభజన కోరుకున్న కె సీ ఆర్ తో దేశ విభజన ప్రమాదం పొంచి ఉందేమో!” అని వ్యాఖ్యానించారు. దీనికి కూడా అంతే స్థాయిలో లైకులు వచ్చాయి. అంటే.. ఇవన్నీ.. తీసి పారేయడానికి వీల్లేదు. ఎవరో కిట్టని వారు చెబుతున్న మాటే అనుకున్నా.. టీ కొట్ల దగ్గర, బడ్డీ కొట్ల దగ్గర, రచ్చబండలపై .. ఈ తరహా చర్చ కనుక ప్రారంభమైతే.. అంతిమంగా.. ఇబ్బందులు తప్పవు. అందుకే.. ముందు… కేసీఆర్ తనలోని మైనస్‌లను గుర్తించి.. వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం .. సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on June 14, 2022 3:16 pm
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ…
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…