ఇపుడిదే అంశం టీఆర్ఎస్ లోనే కాకుండా రాజకీయపార్టీలతో పాటు మామూలు జనాల్లో కూడా చర్చలు జరుగుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని కేసీయార్ డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే ప్రాంతీయపార్టీ అయిన టీఆర్ఎస్ ను జాతీయపార్టీగా మార్చాలని కేసీయార్ అనుకున్నారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ స్ధానంలో బీఆర్ఎస్ (భారత్ రాష్ట్రీయ సమితి) తెరమీదకు వచ్చింది.
బీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ ఒకవైపు జరుగుతున్నాయి. అయితే బీఆర్ఎస్ పెట్టిన తర్వాత కేసీయార్ సక్సెస్ విషయంలో చర్చలు ఊపందుకుంటున్నాయి. జాతీయపార్టీ నిలదొక్కుకోవాలంటే అందుకు ఇతర పార్టీల మద్దతు చాలా అవసరం. అందులోను ప్రాంతీయపార్టీ జాతీయపార్టీగా రూపాంతరం చెంది నిలదొక్కుకోవాలంటే చిన్న విషయంకాదు. ఇక్కడ సమస్య ఏమిటంటే ప్రాంతీయపార్టీ అధినేత హోదాలోనే కేసీయార్ పై మిగిలిన పార్టీల్లో నమ్మకంలేదు.
ఎప్పుడు ఎవరితో ఎలాగుంటారో కేసీయార్ కే తెలీదు. తాను అద్భుతమైన వ్యూహకర్తనని కేసీయార్ కు తనపై తనకు చాలా నమ్మకం. అయితే ఈ వ్యూహాలు తెలంగాణాలోనే ఫెయిలైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక జాతీయస్ధాయిలో ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. నరేంద్రమోడికి వ్యతిరేకంగా చాలా మాటలే మాట్లాడారు. చాలెంజులు చేశారు. కొందరు ప్రతిపక్షాల అధినేతలను కలిశారు. అయితే ఎవరూ సానుకూలంగా స్పందించలేదు.
కేసీయార్ తో కలిసి నడవటానికి ఎవరు సిద్ధంగాలేరు. అలాంటిది ఇపుడు జాతీయపార్టీ అధినేతనని చెప్పుకున్నంత మాత్రాన కేసాయార్ తో ఎవరు కలిసొస్తారన్నదే అసలు పాయింట్. జాతీయపార్టీగా మారినపుడు ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీచేయాల్సుంటుంది. అప్పుడు ఇతర రాష్ట్రాల్లోని పార్టీలతో పొత్తులు తప్పవు. ఇక్కడే పెద్ద సమస్య ఎదురవబోతోంది. ఏపీలో కేసీయార్ తో పొత్తుపెట్టుకోవటానికి ఎవరు సిద్ధంగా ఉండరు. అలాగే మహారాష్ట్ర, కర్నాటకలో కూడా ఎవరు సిద్ధంగా ఉండరు. ఎందుకంటే టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకుంటే పై రాష్ట్రాల్లోని పార్టీల్లో దేనికీ ఉపయోగం ఉండదు. మహారాష్ట్రతో తెలంగాణాకు జలవివాదాలున్నాయి. కాబట్టి ఏ పార్టీ కూడా కేసీయార్ కు సానుకూలంగా ఉండే అవకాశాలు తక్కువ. ఇక కర్నాటకలో బీఆర్ఎస్ ను పట్టించుకునే వారే ఉండరు. కాబట్టి కేసీయార్ సక్సెస్ పై అనేక అనుమానాలున్నాయి.
This post was last modified on June 13, 2022 12:33 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…