విపక్షాలను బూతులు తిడితే పదవులు అన్న మాట ఎన్నో సార్లు నిరూపణ అయింది అన్నది ఎప్పటి నుంచో టీడీపీ అంటున్న మాట. ఆ మాటకు వస్తే తిట్టడంతోనే చాలా మంది వైసీపీ నాయకులు పేరు తెచ్చుకున్నారు అని పరిశీలకులు అంటున్నారు.
ఈ లాజిక్ పసిగట్టిన కొందరు వైసీపీ నేతలు డోసు పెంచి మరీ టీడీపీపై పవన్ పై విరుచుకుపడుతున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. బూతులు వాడితో వచ్చే పదవుల కోసం పరుగులు తీసిన లేదా తీస్తున్న దాఖలాలే ఉన్నాయి అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తాజాగా లోకేశ్ ను తిట్టిన గుర్రంపాటి దేవెందర్ రెడ్డి అనే వైసీపీ లీడర్ కు పదవీయోగం దక్కిందన్న వాదన నడుస్తోంది.
ఇటీవల పదో తరగతి తప్పిన విద్యార్థులతో లోకేశ్ ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్ లో చొరబడి తిట్ల దండకం అందుకునేందుకు ప్రయత్నించి కొంత మేరకు అనుకున్న పని సాధించినందుకే ఆయన్ను ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థకు చైర్మన్ ను చేశారు అని ఒక వాదన నడుస్తోంది.
గుర్రంపాటికి ఈ పదవి అనూహ్య పరిణామమే, కానీ దీనికి లోకేష్ సంబంధం ఏంటని కొందరు వైసీపీ నేతల వాదన. నిన్నటి వరకూ సోషల్ మీడియా ఇంఛార్జ్ గా ఉన్న ఆయన ఒక్కసారిగా ఈ పదవికి సంబంధించి ఎలా ఎన్నికయ్యారో కూడా ఆశ్చర్యకరమే ! అని సొంత పార్టీలో ఇంకో వర్గం అభిప్రాయపడుతోంది.
ఇంతవరకూ ఈ అభివృద్ధి విభాగం ఉందని, దీనికో చైర్మన్ ఉంటారని తెలియని వారికి కూడా ఓ విధంగా జగన్ తెలియజెప్పారు. గతంలో జగన్ ను టార్గెట్ గా చేసుకుని రాజకీయం చేసిన అచ్చెన్న తరువాత కాలంలో చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఆయన్ను తిట్టిన దువ్వాడ శ్రీను అనే లీడర్ ఇప్పుడు ఎంఎల్సీ అయ్యారు.
మళ్లీ మళ్లీ ఆయన బూతులు తిడుతూనే ఉన్నారు. ఇక నానీల ద్వయం పేర్ని నాని, కొడాలి నాని ఇప్పటికీ తిడుతూనే ఉన్నారు బాబును మరియు పవన్ ను ! ఎంతగా అంటే బాబు మీరు మీ తిట్లను తగ్గించండయ్యా అన్నా కూడా వినిపించుకోలేనంతగా తిడుతూనే ఉండేవారు. కానీ పదవులు పోయాక వీరిద్దరు తిట్లను పొదుపుగా వాడుతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
This post was last modified on June 12, 2022 11:30 pm
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…