Political News

టీఆర్ ఎస్‌ను ఏం చేద్దాం.. కేసీఆర్ అంత‌ర్మ‌థ‌నం?!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఇప్పుడున్న టీఆర్ ఎస్‌ను ఏం చేస్తార‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. జాతీయ పార్టీకి భార‌త రాష్ట్ర స‌మితి(బీఆర్ ఎస్‌)గా పేరు పెట్టాల‌ని కేసీఆర్ ఒక తీర్మానం చేసిన‌ట్టు తెలిసింది. ఈ నెలాఖ‌రులోనే జాతీయ పార్టీపై కేసీఆర్ ఒక ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. జాతీయ స్థాయిలో రాజకీయ శూన్యత ఉందని, దేశానికి తెలంగాణ నమూనా అవసరమని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో టీఆర్ ఎస్‌ క్రియాశీ లకం కావాలని కేసీఆర్ అభిప్రాయ‌ప‌డుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో కేసీఆర్ జాతీయ పార్టీకి మొగ్గు చూపుతున్నార‌ని తెలుస్తోంది. కేసీఆర్‌ జాతీయ స్థాయి పర్యటనలు చేపడుతూ విపక్షాలను కూడగడుతున్నది కూడా జాతీయ పార్టీకి మ‌ద్ద‌తుగా వారిని క‌లుపుకొని పోయేందుకేన‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. మ‌రో రెండేళ్ల‌లో కేంద్రంలో ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో కేసీఆర్ ప్ర‌క‌టించ‌నున్న జాతీయ పార్టీకి ప్రాధాన్యం ఏర్ప‌డింది. అయితే.. ఈ క్ర‌మంలో మ‌రో కీల‌క అంశంపై చ‌ర్చ సాగుతోంది. అదే.. ప్ర‌స్తుతం ఉన్న టీఆర్ ఎస్‌ను కొన‌సాగిస్తారా? లేదా? అని మేధావులు సైతం చ‌ర్చిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) అధినేత కేసీఆర్‌ జాతీయ పార్టీ పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. దాని పేరు ‘భారత రాష్ట్ర సమితి’ (బీఆర్‌ఎస్‌) అనే సంకేతాలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, అందరి సందేహం ఒక్కటే. అదే.. టీఆర్‌ఎస్‌ ఉంటుందా!? ఉండదా!? అన్నదే! ఇత‌ర జాతీయ పార్టీల‌తో పోల్చుకుంటే.. టీఆర్‌ఎస్‌ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ఏర్పడిన పార్టీ కావడమే ఇందుకు కారణం. దాంతో, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఎప్పట్లాగే కొనసాగుతుందా? జాతీయ పార్టీగా బీఆర్‌ఎస్‌ ఏర్పడుతుందా!? లేక, బీఆర్‌ఎస్‌లో టీఆర్‌ఎస్‌ విలీనం అవుతుందా? అనేది ఆస‌క్తిగా మారింది.

ఇత‌ర ప్రాంతీయ పార్టీల ప‌రిస్తితి ఇదీ..

కొన్ని ప్రాంతీయ పార్టీలు.. ఆయా రాష్ట్రాల్లోనే ఆవిర్భ‌వించినా.. జాతీయ‌స్థాయిలో అవి చ‌క్రం తిప్పుతున్నాయి. అయితే.. వాటికి పార్టీ పేరుతో ఇబ్బంది రాలేదు. ఉదాహ‌ర‌ణ‌కు.. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) మహారాష్ట్రలో పుట్టింది. జాతీయ స్థాయికి విస్తరిస్తోంది. దీనికి పేరుతో ఇబ్బంది రాలేదు. ఇక‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ పశ్చిమ బెంగాల్‌లో ఆవిర్భవించింది. జాతీయ స్థాయి విస్తరణ ప్రణాళికల్లో ఉంది. దీనికి కూడా ఎలాంటి ఇబ్బంది రాలేదు. అదేస‌మ‌యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఢిల్లీలో శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వ‌చ్చింది.

మార్చితే ఒక తంటా.. మార్చ‌క‌పోతే.. మ‌రో తంటా!

ఆయా పార్టీల పేర్లలో స్థానికత, ప్రాంతీయతను సూచించే పదాలు లేకపోవడంతో అవి స్వేచ్ఛ‌గా అన్ని రాష్ట్రాల్లోనూ పునాదులు వేసుకుంటున్నాయి. కానీ, టీఆర్ ఎస్ కేవ‌లం .. తెలంగాణ కోస‌మే పుట్టిన పార్టీ. మ‌రి ఇప్పుడు దీనిని జాతీయ స్థాయికి విస్త‌రిస్తే.. ఏం చేయాలి..? అనేది కేసీఆర్‌ను గ‌డ‌బిడ‌కు గురి చేస్తున్న ప్ర‌శ్న‌. పేరు మార్చితే.. సెంటిమెంటుకు ప్రాధాన్యం పోతుంది.. మార్చ‌క‌పోతే.. రాష్ట్రానికే ప‌రిమితం అవుతుంది.. దీంతో కేసీఆర్ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌కు గుర‌వుతున్నార‌ని అంటున్నారు.

This post was last modified on June 12, 2022 9:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

2 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

2 hours ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

3 hours ago

నారా కుటుంబం ప్ర‌జ‌ల సొమ్ము దోచుకోదు: భువ‌నేశ్వ‌రి

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం వెళ్లిన‌.. ఆయ న స‌తీమ‌ణి నారా…

4 hours ago

రివర్స్ గేమ్ ఆడబోతున్న ఉపేంద్ర ?

అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…

4 hours ago

ఆయ‌న సినిమా హీరో అంతే: డీజీపీ

అల్లు అర్జున్‌-పుష్ప‌-2 వివాదంపై తాజాగా తెలంగాణ‌ డీజీపీ జితేంద‌ర్‌ స్పందించారు. ఆయ‌న సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్య‌వ‌హారంపై…

5 hours ago