Political News

కొత్త ప‌దవుల వేట‌ లో జ‌గ‌న్!

త్వ‌ర‌లో .. వైసీపీ త‌ర‌ఫున నాలుగు విప్ ప‌దవులు రానున్నాయి. తాజా స‌మాచారం ప్రకారం క‌మ్మ సామాజికవ‌ర్గ నేత‌కు ఒక‌టి కేటాయించే అవ‌కాశాలున్నాయి. మిగిలిన 3 కూడా గ‌త ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన నాయ‌కులను ఢీకొన్న వారికే వ‌రించ‌నున్నాయి అని తెలుస్తోంది.

కొత్త ప‌ద‌వుల వేట‌లో వైసీపీ ఉంది. అదేవిధంగా ప‌ద‌వుల సంఖ్య పెంపుపై కూడా ఆస‌క్తిగా ఉంది. తాజా స‌మాచారం అనుస‌రించి శాస‌న స‌భ‌లో విప్ -ల సంఖ్య పెంచేందుకు ముఖ్యమంత్రి జగన్ యోచిస్తున్నారు.

ఇప్ప‌టిదాకా ఎనిమిది మందికి విప్ ప‌ద‌వులు, ఒక‌రికి చీఫ్ విప్ ప‌ద‌వి ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని, ఇప్పుడు తాజాగా 9 నుంచి ప‌ది వ‌ర‌కూ విప్ ప‌ద‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టి దాకా విప్ గా ఉన్న బూడి ముత్యాల నాయుడును మంత్రిని చేశారు. డిప్యూటీ సీఎం ను కూడా చేశారు. అదేవిధంగా మ‌రో విప్ దాడిశెట్టి రాజా ( ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా, రాజా న‌గ‌రం ఎమ్మెల్యే) ను కూడా ఆర్ అండ్ బీ మంత్రిని చేశారు.

దీంతో తాజాగా ఏర్ప‌డ్డ రెండు ఖాళీల‌కు కొత్త ముఖాలు వెత‌కాలి. అదేవిధంగా మంత్రి ప‌ద‌వి రాలేద‌ని అసంతృప్తితో ర‌గిలిపోతున్న వారికి ఉప‌శమ‌నం ఇచ్చే విధంగా నిర్ణ‌యం తీసుకోవాలి అని వైసీపీ భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో విప్ బ‌రిలో చింత‌మ‌నేని ప్ర‌త్య‌ర్థి అబ్బ‌య్య చౌద‌రికి ఉన్నారు అని తెలుస్తోంది.

ఇదేవిధంగా మ‌రో పేరు క‌ర‌ణం ధ‌ర్మ శ్రీ (చోడ‌వ‌రం ఎమ్మెల్యే) పేరు విన‌ప‌డుతోంది. ఈ రెండూ కాకుండా మ‌రో రెండు పేర్లు కూడా ప్ర‌ముఖంగా ఉన్నాయి. తెనాలి ఎమ్మెల్యే అన్నాబ‌త్తుల శివ‌కుమార్ కు కూడా క‌మ్మ సామాజిక‌వ‌ర్గం కోటాలోనే విప్ ప‌దవుల జాబితాలో చోటు ద‌క్క‌వ‌చ్చ‌న్న ఆలోచ‌న ఉంది.

ఇదేకోవ‌లో భీమ‌వ‌రం ఎమ్మెల్యే గ్రంధి శ్రీ‌నివాస్ పేరు కూడా విప్ జాబితాలో ఉండ‌నుంది అని తెలుస్తోంది. పాయ‌క‌రావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబు రావు పేరు కూడా ఇదే కోవ‌లో వినిపిస్తుంది.అంటే ఇప్ప‌టిదాకా నెల‌కొన్న రెండు ఖాళీలు, వీటితో పాటు జాబితాలో ఉన్న ఎనిమిదిని కాస్త ప‌ది చేయ‌డం ద్వారా వ‌చ్చే అద‌న‌పు రెండు ఖాళీలు క‌లుపుకుని సెషన్లో ఫ్లోర్ కో – ఆర్డినేష‌న్ కోసం న‌లుగురు కొత్త ముఖాలు రానున్నాయి. విప్ ప‌ద‌వులు అందుకోనున్నాయి.

This post was last modified on June 12, 2022 9:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబీది టీజర్… అనిల్‌ది ట్రైలర్

ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…

50 minutes ago

ఎంపీ ఈటల వర్సెస్ ఎమ్మెల్యే మర్రి

రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…

55 minutes ago

చూపు లేకపోయినా చిరంజీవి కోసం

అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…

2 hours ago

మారుతి అడ్రస్ ఛాలెంజ్… టోల్ మెటీరియల్ ఐపోయింది

సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…

3 hours ago

శృతి లాగే శ్రీలీల.. పవన్ హిట్ ఇస్తాడా?

​టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…

4 hours ago

శర్వా సహకరించకపోవడమా?

శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ…

5 hours ago