వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం విభేదాలు వీడి నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఖమ్మంలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. అసంతృప్త నేతలు పార్టీ మారుతారన్న ప్రచారం దృష్ట్యా.. ఈ ప్రత్యేక భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా పనిచేయాలని నేతలకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఉమ్మడి జిల్లాలో టీఆర్ ఎస్ బలోపేతంపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. నేతల మధ్య విభేదాలు పరిష్కారం కోసం నేతలతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. టీఆర్ ఎస్ ప్రాతినిధ్యం వహించే స్థానాల్లో నేతల మధ్య విభేదాలు ఉండకూడదని సూచించారు. ఖమ్మం మినహా ఇతర నియోజకవర్గాల్లో నేతల మధ్య గ్రూప్ రాజకీయాలు తగదని హితవు పలికారు. జిల్లాలో పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయంపై కేటీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గ్రూపు చేస్తే.. ఆ నాయకులను నిర్మొహమాటంగా ఇంటికి పంపుతామని హెచ్చరించారు.
ఇదిలావుంటే, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేది ఒక్క టీఆర్ఎస్ మాత్రమేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచి ప్రతిరోజు టూరిస్ట్‌లు వస్తున్నారని ఎద్దేవాచేశారు. ఒక్క చాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్ అంటున్నారని, 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏం అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. ఎంపీ రేవంత్ రెడ్డి రెడ్లకు అధికారం ఇవ్వాలని బహిరంగంగా చెబుతున్నారని, కులపిచ్చిగాళ్లు కావాలా?, అభివృద్ధి కోసం పాటుపడే టీఆర్ఎస్ కావాలా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
This post was last modified on June 11, 2022 10:02 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…