పనిచేయకపోతే ఒప్పుకోను..ప్రజల మధ్య ఉండకపోతే, వారి మధ్య ఉంటూ సమస్యలను తెలుసుకోకపోతే ఒప్పుకోను అంటూ జగన్ నిన్నటి వేళ పదే పదే సీరియస్ అయ్యారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం తలపెట్టి నెలరోజులు (దాదాపు) పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్నటి వేళ అమరావతిలో వర్క్ షాప్ నిర్వహించిన విషయం తెలిసిందే ! ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేలకు చుక్కలు కనపడ్డాయి. ఐ ప్యాక్ టీం సీన్ లోకి వచ్చాక అన్నీ మారిపోతాయి అని ముందునుంచి అనుకున్న విధంగానే ఒక్కొ క్క నేతా పల్స్ ను వాళ్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్-తో వివరిస్తూ ముచ్చెమటలు పోయించారు.
దీంతో పాటు సీఎం చెప్పిన విధంగా కెరియర్ గ్రాఫ్ సరిగా లేని వారు, పెర్ఫార్మెన్స్ గ్రాఫ్ సరిగా లేని వారు ఇక ఇళ్లకే పరిమితం అని చెప్పి, రానున్న ఆర్నెల్ల కాలంలో ఇంప్రూవ్ చేసుకోకపోతే ఇంటికే అని తేల్చేశారు. ఇక జీరో రిజల్ట్ ఉన్న ఎమ్మెల్యేలను బ్లాక్ లిస్టులో ఉంచుతారు. ఇప్పుడీ బ్లాక్ లిస్ట్ లో ఏడుగురు ఎమ్మెల్యేల పేర్లు చేరిపోయాయి అని నిర్థారణ అవుతోంది. ఇందులో ముఖ్యంగా శ్రీశైలం, కోవూరుతో సహా మిగతా నియోజకవర్గాలు కూడా ఉన్నాయి.
ఇక బ్లాక్ లిస్టుపై చాలా మంది ఇప్పటి నుంచే బెంగ పెట్టుకుంటున్నారు.ఇది ప్రాథమిక దశ అని, గడపగడపకూ రెండో విడత తరువాత మరికొన్ని పేర్లు వచ్చి చేరుతాయి అని, క్షేత్ర స్థాయిలో తిరిగేందుకు మొహమాట పడాల్సిన అవసరమేం లేదని, వలంటీర్ల సాయంతో తిరగాల్సిన అవసరం కూడా లేదని, సమస్యలు తెలిస్తేనే గడప గడపకూ కార్యక్రమం సక్సెస్ అయిందని భావించాల్సి ఉంటుందని మంత్రులు కొందరు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా శత్రువు ఇంటికి వెళ్లయినా సరే పథకాలు అమలు అవుతున్నాయో లేదో తెలుసుకుంటానని పేర్నినాని సంచలన వ్యాఖ్యలుచేశారు.
సీఎంతో జరిగిన సమావేశం తరువాత ఆయనీ వ్యాఖ్యలు చేయడం సంచలనం అయింది. ఏదేమయినప్పటికీ ఇంట్లో ఉంటే నో ఛాన్స్.. ఇల్లిల్లూ తిరిగితేనే ఛాన్స్ అని చెప్పేశారు. ఇదొక నిరంతర ప్రక్రియ అని పనితీరు బాగుంటే కొత్త వారికి కూడా అవకాశాలు వస్తాయని నిన్నటి వేళ తేలిపోయింది. కొందరు ఎమ్మెల్యేలు తెలివిగా వలంటీర్ల సాయంతో కార్యక్రమాన్ని చక్కబెడుతున్నారని, ఇది కరెక్టు కాదని కూడా సీఎం వ్యాఖ్యానించారని తెలుస్తోంది. సమస్యలు తెలిపినా, నిరసనలు వ్యక్తం చేసినా అవన్నీ భరించాల్సిందే అని కూడా తేల్చి చెప్పారు సీఎం. కనుక బ్లాక్ లిస్టులో ఎవరి పేరు ఎప్పుడు ఏ వేళ చేరుతుందో అంతుబట్టని విషయమేనని వైసీపీ శ్రేణులు అంటున్నారు
This post was last modified on June 9, 2022 3:14 pm
వైసీపీ హయాంలో సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి…
ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే బాలీవుడ్డే అనే పరిస్థితి ఉండేది. బాలీవుడ్ ముందు మిగతా ఇండస్ట్రీలు నిలిచేవి కావు.…
మహేష్ బాబు సినిమాను రాజమౌళి ఈపాటికే మొదలుపెట్టాల్సింది. కానీ పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాతనే ప్రాజెక్టును స్టార్ట్…
ఐపీఎల్ మొదలైన తరువాత క్రికెట్ ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నేటితరం యువకులు అతి చిన్న వయసులోనే క్రికెట్…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఐడియా వేస్తే.. తిరుగుండదు. అది ఎన్నికలైనా.. రాజకీయాలైనా పాలనలో అయినా.. ఆయన ఆలోచనలు…