వైసీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో ఎవరు నంబర్ 1 అన్న మాటకు తూగారు ఒకే ఒక్కరు ఆయనే చీఫ్ విప్ రాజు. నరసాపురం నుంచి తొలిసారి పోటీచేసి ఎమ్మెల్యే అయిన ఈయన పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాలను విస్తృతంగా తీసుకువెళ్తున్నా రని జగన్ ఇవాళ ప్రశంసించారు. ఈయన పూర్తి పేరు ముదునూరి ప్రసాదరాజు.. ఎమ్మెల్యేల గ్రాఫ్ లో నంబర్ ఒన్ ఈయనేనని తేల్చి చెప్పారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో దాదాపు నెల రోజులుగా జరుగుతున్న సంగతి తెలిసిందే !
ఈ నేపథ్యంలో వర్క్ షాప్ ను అమరావతిలో నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేల పనితీరును ఒక్కసారి పునరావలోకనం చేశారు. ఏడు నియోజకవర్గాల్లో అస్సలు గడపగడపకూ కార్యక్రమం నిర్వహించలేదని తేలిపోయింది. అదేవిధంగా కొందరి ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తికరంగా ఉందని ఐ ప్యాక్ నివేదికలు తేల్చాయి.
సమావేశంలో భాగంగా జగన్ చాలా విషయాలు ఎమ్మెల్యేలకూ, పార్టీ ఇంఛార్జులకూ, రీజనల్ కోఆర్డినేటర్లకూ, మంత్రులకూ వివరించే ప్రయత్నం చేశారు. విప్ తోపాటు నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ పై కూడా ప్రశంసల వాన కురిసింది. ఆయనకు ఫోన్ చేసి మరీ! జగన్ అభినందించారు. ఆరోగ్యం బాలేని కారణంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వచ్చిన ఆయనతో చాలా సేపు మాట్లాడారు.
ఎపార్ట్ ఫ్రమ్ దిస్.. మంత్రులతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు అస్సలు నియోజకవర్గాల్లో తిరుగాడడం లేదని కూడా తేలిపోయింది. పార్టీ నాయకులు ప్రజల మధ్య ఉండకపోతే తానేం చేయలేనని, జీరో రిజల్ట్ తెచ్చుకున్న వారు బ్లాక్ లిస్టు లో ఉంటారని కూడా అన్నారు. జోగి రమేశ్ లాంటి మంత్రులు కూడా సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ప్రజల్లో ఉంటేనే పబ్లిక్ పల్స్ తెలుస్తుందని అంటున్నారు. మొత్తానికి పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి ఐ ప్యాక్ ఇన్వాల్మెంట్ ఈ రోజు నుంచి మొదలయింది.
అధికారికంగా సర్వేలు తేలిపోవడంతో ఎమ్మెల్యేలు ముచ్చెమటలు పోస్తున్నారు. పనిచేసే వారికి ఏ బెంగా లేకున్నా, పార్టీ సిద్ధాంతాలు విని, ఆచరించని వారికి, ప్రభుత్వ విధి విధానాలు పట్టించుకోకుండా జనంలో తిరగకుండా ఉన్నవారికి మాత్రం పెద్దగానే క్లాస్ పడింది.
ఆఖరుగా 175కు 175 స్థానాలూ తెచ్చుకోవాలని జగన్ తేల్చేశారు. అందుకు మంత్రులు, జిల్లా ఇంఛార్జులు సమన్వయంతో పనిచేయాల్సిందేనని కుండ బద్దలు కొట్టేశారు. బాగా పనిచేసేవారికి గుర్తింపు ఇస్తూనే, చేయని వారికి మాత్రం చురకలు అంటించి, అన్నింటికీ పార్టీనే మూలం కనుక పార్టీ బాగు కోసం నిర్ణయాల అమలులో భాగంగా ఏ చిన్న తప్పు పని చేసినా అది తనకు రిస్కేనని తేల్చేశారు.
This post was last modified on June 9, 2022 9:29 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…