ఏపీ బీజేపీ విషయంలో రాజకీయ చర్చలు జోరందుకున్నాయి. సీఎంను నిర్ణయించేది ఎవరు? అనే ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంపై ఇప్పుడే మాట్లాడొద్దని.. పార్టీ జాతీయ అధ్యక్షులు.. జేపీ నడ్డా తేల్చి చెప్పారు. కానీ, ఇదేసమయంలో బీజేపీలోనే ఉన్న కొందరు నాయకులు ఇప్పటికే మనం.. జనసేనతో పొత్తులో ఉన్నాం కాబట్టి.. ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే.. పార్టీలో మరింత ఊపు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కానీ, నడ్డా మాత్రం షరతులకు బీజేపీ లొంగదని.. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో తాము చేసిందే నిర్ణయమని.. పార్టీ నియోజకవర్గ స్థాయి శక్తి కేంద్రాల భేటీలో వ్యాఖ్యానించారు. నిజానికి పొత్తులో ఉన్న పార్టీలు ఏవైనా.. సీఎం అభ్యర్థిని ఎలా నిర్ణయిస్తాయి? ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. ఎన్నికల్లో ఏ పార్టీ అయితే.. ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటే.. ఆ పార్టీకే సీఎం అభ్యర్థి పోస్టు దక్కుతోంది.
ఒకవేళ బీజేపీ పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించినా బీజేపీ కి ఎక్కువ సీట్లు వచ్చి జనసేనకు తక్కువ సీట్లు వస్తే… మాట మార్చేస్తుంది.
ఎందుకంటే ఎక్కువ సీట్లు ఉన్నవారు ఆబ్వియస్ గా సీఎం అవుతారు. చేతిలో సీట్లు ఉంటే ఎవరో ఎవరినో సీఎం చేయాల్సిన అవసరం లేదు. కదా. పవన్ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఈ విషయం నడ్డాకు తెలియంది కాదు. అయినప్పటికీ.. ముఖ్యమంత్రి అభ్యర్థిని తామే నిర్ణయిస్తామన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించడం.. అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. నిజానికి ఒక్కశాతం కూడా ఓటు బ్యాంకు లేని బీజేపీ.. ముందు ఓటు బ్యాంకు పుంజుకునే విషయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే.. దీనిని పక్కన పెట్టిన పార్టీ.. అధికారంలోకి వచ్చేస్తామని.. ముఖ్యమంత్రి అభ్యర్థిని తామే నిర్ణయిస్తామని ప్రకటించడం.. వంటివి రాజకీయాల్లో చిత్రంగా అనిపిస్తోందని అంటున్నారు.
ప్రస్తుతం బీజేపీకి ఒక్క సీటు కూడా ప్రాతినిధ్యం కనిపించడం లేదు. కనీసం బైపోల్స్‌లో కూడా ఆశించిన విధంగా పార్టీ పుంజుకున్నది కూడా లేదు. మూడేళ్లలో ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా పుంజుకోలేదు. ఇక, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆశించిన దూకుడు చూపించలేదు. మరి ఇలాంటి పరిస్థితిలో ఉట్టికే ఎగరలే ని పరిస్థితి ఉంటే.. ముఖ్యమంత్రిని నిర్ణయించే స్థాయిలో ఉన్నామని చెప్పుకోవడం.. వాపును చూసి బలుపు అనుకోవడం.. ఏమేరకు సమంజసమనేది ప్రశ్న. ఏదేమైనా.. ప్రజల తీర్పు నిర్ణయించే ముఖ్యమంత్రి పీఠాన్ని వీరు తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించడం.. విమర్శలకు తావిస్తుండడం గమనార్హం.
This post was last modified on %s = human-readable time difference 7:28 pm
నిత్యం విరామం లేని పనులతో.. కలుసుకునే అతిథులతో బిజీబిజీగా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా టీ కాచారు. స్వయంగా…
తెలంగాణలోనూ తెలుగు దేశం పార్టీని పరుగులు పెట్టించాలని భావిస్తున్న ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆదిశగా…
ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి నాలుగు మాసాలు అయింది. అయితే… వచ్చిన తొలినాళ్లలో చేయాలనుకున్న పనులను కొంత లేటుగా ప్రారంభించేవారు.…
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులే లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే…
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఈమధ్య మరింత స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్ 3’లో నటిస్తున్నాడు.…
ఆంధ్రప్రదేశ్లో ఉన్న మద్యం ధరలకు సమానంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మద్యం ధరలు పెరగనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. త్వరలోనే బీరు…