ఆంధ్రావనిలో విభిన్న రాజకీయ వాతావరణమే నెలకొని ఉంది. ఎన్నికలకు రెండేళ్ల దూరం ఉండగానే ప్రముఖ పార్టీల నాయకులు వేదికలపై విభిన్న ధోరణుల్లో వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. వీటిని ప్రజలు అర్థం చేసుకోవడంలోనే విజ్ఞత ఉంది. వాస్తవానికి ఎన్నికల వేళ చెప్పాల్సిన మాటలే ఇవి కానీ ముందుగానే అప్పగిస్తున్నారు. ఎన్నికల వేళ చేయాల్సిన పనులే ఇవి కానీ ముందుగానే రాజకీయ రాద్ధాంతాలు చేస్తున్నారు. వీటి కారణంగా అస్థిరత ఒకటి ఏర్పడడం ఖాయం.
పొత్తులవిషయమై కానీ పథకాల విషయమై కానీ వేటిపై మాట్లాడినా అవన్నీ రాజకీయంలో భాగమే కానీ మరీ ఇంత ముందస్తుగా మాట్లాడాల్సిన పని అయితే లేదు. అవును ! బీజేపీ ఇప్పుడిక ఏపీలో నిలదొక్కుకోవాలని యోచిస్తోంది. ఆ క్రమంలో తనదైన రాజకీయం నెరవేర్పునకు బాటలు వేస్తోంది. తెలంగాణ మరియు ఆంధ్రాలో ఏక కాలంలో బీజేపీ పాలక పార్టీలతో కయ్యాలకు కాలు దువ్వుతోంది. వీటి కారణంగా రాజకీయ అస్థిరత అయితే ఏర్పడదు కానీ పాలన సంబంధ పనుల్లో కాస్త గందరగోళం నెలకొనక తప్పదు.
ఇప్పటికే బీజేపీ బాస్ జేపీ నడ్డా రెండ్రోజుల పర్యటనలో భాగంగా చాలా మాటలు చెప్పారు. అవి నిరూపణలో ఉన్నాయా లేదా అన్నది అటుంచితే, వీటి ప్రభావం ప్రజలపై పడక తప్పదు. గోదావరి తీరాన ఆయన ఆసక్తిదాయక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం అని అన్నారు. బీజేపీ గెలుపు తథ్యం అని కూడా అన్నారు. ఈ రెండూ సాధ్యమా ఓ సారి చూద్దాం. ముఖ్యంగా వైసీపీ కొన్ని తప్పిదాలు పాలనపరంగా చేసినా కూడా ప్రతిపక్షాలు చెప్పినంతగా ప్రజాభిమానం ఏమీ కోల్పోయి లేదు. అదేవిధంగా బీజేపీకి అధికారం ఇచ్చేంతగా పాలక పార్టీ తప్పిదాలు ఏమీ లేవు.
అయినా ఆంధ్రా అభివృద్ధికి కీలకం అనుకునే ఏ ఒక్క విషయంలో కూడా సహకరించని లేదా నిధులు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వని ఓ జాతీయ పార్టీని
ఈ ప్రాంత ఓటర్లు ఎలా నమ్ముతారు అని ! వైసీపీ ఓటమి అయితే సాధ్యం అవుతుందో లేదో కానీ బీజేపీ ఒంటరిపోరులో భాగంగా గెలుపు అయితే సాధ్యం కాదు. ఆయన ఏ ఉద్దేశంతో ఉన్నా ఏ ఉద్దేశంలో భాగంగా అన్నా కూడా క్షేత్ర స్థాయిలో సరైన కార్యవర్గం కూడా లేని బీజేపీ ఇప్పటికిప్పుడు అధికారం కోసం కలలు కనడం మాత్రం పెద్దగా భావ్యంగా లేదు. కలలు ఎవరైనా కనొచ్చు కానీ సాధ్యం అయిన రీతిలోనే కలలు కంటే మంచి ఫలితాలు వాటికి అనుగుణంగా పాలక ప్రభుత్వాలు ఏర్పాటు కావడం అన్నది తథ్యం.
This post was last modified on June 8, 2022 5:44 pm
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…
వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన…
భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఉత్తమ…