ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా చెడ్డీలను తగులబెట్టాలని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది. దీంతో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలే నిక్కర్లను పోగుచేసి కాంగ్రెస్ కార్యాలయానికి పంపుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కర్ణాటకలో ఓ చిత్రమైన వివాదం తెరమీదికి వచ్చింది. అదే చెడ్డీ వివాదం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్ఎస్)కు వ్యతిరేకంగా చెడ్డీలను తగులబెట్టాలని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది.
దీంతో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలే నిక్కర్లను పోగుచేసి కాంగ్రెస్ కార్యాలయానికి పంపుతుండటం గమనార్హం. విద్యను కాషాయీకరణం చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా సభ్యులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ ఇంటి బయట ఖాకీ నిక్కర్లను కాల్చి తమ నిరసన వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ‘ఎన్‌ఎస్‌యూఐ సభ్యులు పోలీసుల ఎదుట చెడ్డీలను కాల్చారు. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా మేం ఎక్కడైనా కాలుస్తాం’ అని పేర్కొన్నారు.
మాజీ సీఎం వ్యాఖ్యలు కాస్తా వివాదానికి దారితీశాయి. బీజేపీ నేత చలవాడి నారాయణస్వామి మాట్లాడుతూ.. ఆయన ఈ స్థాయికి దిగజారుతారని ఊహించలేదని పేర్కొన్నారు. ‘సిద్ధరామయ్య చెడ్డీలు కాల్చాలనుకుంటే ఆయన ఇంట్లో వాటిని కాల్చుకోనీయండి. సిద్దరామయ్యకు చడ్డీలు పంపి సహాయం చేయమని ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులకు తెలియజేశాను.
చడ్డీలను కాల్చడం వల్ల వాయుకాలుష్యం ఏర్పడుతుంది కాబట్టి కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి తీసుకోవాలని ఆయన్ను కోరుతున్నాను. సిద్ధరామయ్య ఈ స్థాయికి దిగజారిపోతారని అనుకోలే దు’ అని అన్నారు. ఇదిలా ఉంటే.. సిద్ధరామయ్య వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆరెస్సెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయానికి పెద్ద ఎత్తున నిక్కర్ పార్సిళ్లను పంపుతున్నారు.
This post was last modified on June 7, 2022 7:51 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…