సమైక్య రాష్ట్రంలో కేసీయార్ వెన్నుపోటుకు ప్రయత్నించారా ? మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఏ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలంగాణా ఉద్యమంలో అమరవీరుల స్మృత్యర్ధం ఓ కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలోనే చంద్రబాబునాయుడును దింపేసి తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు కేసీయార్ ప్రయత్నించినట్లు చెప్పారు. కేసీయార్ కున్నంత అధికార దాహం ప్రపంచంలో మరే నేతకు లేదన్నారు.
కేసీయార్ చేసిన ప్రయత్నాలు చివరి నిముషంలో చంద్రబాబుకు తెలియటంతోనే జాగ్రత్త పడినట్లు చెప్పారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లోనే కేసీయార్ టీడీపీని వదిలేసి బయటకు వెళ్ళిపోయినట్లు తెలిపారు. చంద్రబాబు మొదటసారి ముఖ్యమంత్రయినపుడు తాను, కేసీయార్ ఇద్దరం మంత్రులుగా పనిచేసిన విషయాన్ని చంద్రశేఖర్ గుర్తుచేశారు. పదవుల కోసం కుట్రలు చేయటం కేసీయార్ కు మొదటి నుండి వచ్చిన అలవాటే అంటు మండిపడ్డారు.
అప్పట్లో టీడీపీ ఎంఎల్ఏల్లో 60 మందిని చీల్చేసి చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేయటానికి కేసీయార్ ప్రయత్నించినట్లు చెప్పారు. అయితే 61వ ఎంఎల్ఏగా తమతో చేరిన జ్యోతుల నెహ్రు చివరి నిముషంలో ఈ కుట్ర విషయాన్ని చెప్పటంతో చంద్రబాబు జాగ్రత్త పడినట్లు గుర్తుచేశారు. తనతో పాటు కేసీయార్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అందరం చంద్రబాబుకు వ్యతిరేకంగా కలిసినట్లు అంగీకరించారు. 60 మంది ఎంఎల్ఏలు జమవ్వగానే అందరం కలిసి గవర్నర్ దగ్గరకు వెళ్ళి చంద్రబాబు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని కేసీయార్ రెడీ అయినట్లు కూడా చెప్పారు.
తర్వాత జరిగిన పరిణామాల్లో తెలంగాణా ఉద్యమంలో తనను ముఖ్యమంత్రి ని చేస్తానని కేసీయార్ ఎన్నో సార్లు హామీ ఇచ్చినట్లు చంద్రశేఖర్ చెప్పారు. అలాగే మధుసూదనాచారి లాంటి వాళ్ళని మంత్రులను చేస్తానని మండిపడ్డారు. నోటికొచ్చినట్లుగా హామీలిచ్చేయటం తర్వాత వాటిని గాలికొదిలేయటం కేసీయార్ కు అలవాటే అని చెప్పటానికే పాత విషయాలను చంద్రశేఖర్ ప్రస్తావించారు. ఏదేమైనా ఎప్పుడో జరిగిన రాజకీయ పరిణామాలను చంద్రశేఖర్ ఇపుడు బయట పెట్టడం ఆశ్చర్యంగానే ఉంది. ఈ మాజీ మంత్రి చెప్పేంతవరకు అప్పట్లో కేసీయార్ చేసిన ప్రయత్నాలు ఎవరికీ తెలీకపోవటం విచిత్రంగానే ఉంది.
This post was last modified on June 3, 2022 10:33 am
ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…