Political News

ఆవిర్భావం : ఒక తెలంగాణ 5 పార్టీలు

చాలా పార్టీలు లక్ష్యాల‌ను చేరుకోలేక‌పోయాయి కానీ తెలంగాణ రాష్ట్ర స‌మితి అనుకున్న ల‌క్ష్యాన్ని కాంగ్రెస్ ను ఒప్పించి మ‌రీ! సాధించుకుంది.ఆ రోజు నుంచి ఈ రోజు వ‌ర‌కూ ఉద్య‌మ చ‌రిత్ర‌లో కూడా టీఆర్ఎస్ పార్టీకి స‌ముచిత స్థానం ఉంది. అన్ని ప్ర‌జా సంఘాల‌తోనూ క‌లిసి కొట్లాడిన ఘ‌న‌త ఓ విధంగా కేసీఆర్ ది అదేవిధంగా మిగ‌తా యాక్టివిస్టుల‌ది కూడా ! ఆ ఇద్ద‌రు ప్రొఫెస‌ర్లూ లేనిదే అస్స‌లు తెలంగాణ ఉద్య‌మమే లేదు అని చెప్ప‌డం కూడా వాస్త‌వ‌మే! జ‌యశంక‌ర్ కానీ కోదండ‌రాం కానీ చేసిన కృషిని మ‌రువ‌లేం అని అంటున్నాయి సోషల్ మీడియా వ‌ర్గాలు. ఈ త‌రుణాన పార్టీల ప్ర‌భావం, ఉనికి ఎలా ఉన్నా టీఆర్ఎస్ లాంటి తెలంగాణ సంస్కృతి, ఇక్క‌డి ఉద్య‌మ నేప‌థ్యం తెలిసిన పార్టీలే మున్ముందు కూడా మ‌నుగడ సాగించ‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ నేత‌లు విశ్వాసం వ్య‌క్తం చేస్తూ నాటి ప‌రిణామాల‌ను పున‌రావ‌లోకనం చేస్తూ ఉన్నారు ఈ ఆవిర్భావ వేళ.

మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితి
పటోళ్ల ఇంద్రా రెడ్డి జై తెలంగాణ పార్టీ
దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ ప్రజా పార్టీ
విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ
కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర స‌మితి

తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం ఇవాళ. అమ‌రుల‌ను స్మ‌రిస్తూ ఉద్య‌మ స్ఫూర్తిని మ‌ళ్లీ మ‌ళ్లీ చాటేందుకు తెలంగాణ వాకిట వాడ‌వాడ‌లా ప్ర‌జ‌లు సంబ‌రాలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ కొన్ని గంట‌ల క్రితం గ‌న్ పార్క్ వ‌ద్ద ఉన్న అమ‌రుల స్థూపం వ‌ద్ద నివాళి అర్పించారు. ఆ రోజు తెలంగాణ సాధ‌న కోసం చేసిన కృషిని, రాష్ట్రం వ‌చ్చాక సాధించిన అభివృద్ధిని అన్నింటినీ త‌ల్చుకున్నారు కేసీఆర్.

అమ‌రుల స్ఫూర్తితో రానున్న కాలంలో తెలంగాణ అనేక రంగాల్లో ఇదే విధంగా దేశం గ‌ర్వించే స్థాయికి చేరుకుని ఆద‌ర్శ‌నీయ ప్ర‌గ‌తిని అందుకోవ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారాయ‌న. ఇదే సంద‌ర్భాన తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ ల గురించి సోష‌ల్ మీడియాలో మ‌ళ్లీ ఓ సారి చ‌ర్చ నడుస్తోంది.

కేసీఆర్ కు ముందు, త‌రువాత ఉద్య‌మాన్ని అభివ‌ర్ణించ‌వ‌చ్చ‌ని సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు అంటున్నారు. చెన్నారెడ్డి లాంటి వారు పార్టీ పెట్టినా పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. అదే సంద‌ర్భంలో కొన్ని రాజకీయ ఒత్తిళ్లు కూడా ఆయ‌న‌పై ప‌నిచేశాయని ఇప్ప‌టికీ చాలా మంది అంటుంటారు. చెన్నారెడ్డి పార్టీ పెట్టినా ప్ర‌యోజ‌నం లేక‌పోవ‌డంతో చాలా మంది డైల‌మాలో ప‌డిపోయారు.

తెలంగాణ సాధ‌న అంత సులువుగా తేలిపోద‌ని నిర్ణ‌యించారు కూడా ! అటుపై పటోళ్ల ఇంద్రారెడ్డి, దేవేంద‌ర్ గౌడ్ లాంటి వారు కూడా ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న కోసం కొంత ప‌నిచేశారు. తెలంగాణ గొంతుకను బ‌లీయంగానే వినిపించారు.

టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన దేవేంద‌ర్ గౌడ్ త‌రువాత కాలం రాజ‌కీయంగా ఏ పాటి ప్ర‌భావం చూప‌లేక‌పోయారు అన్న‌ది ఓ వాస్త‌వం. ఇదే క్ర‌మంలో విజ‌య‌శాంతి కూడా పెద్ద‌గా ప్ర‌భావం చూప‌ని లీడ‌ర్ గానే మిగిలిపోయారు. తెలంగాణ ఏర్పాటు త‌రువాత కూడా వైఎస్సార్టీపీ అంటూ ష‌ర్మిల లాంటి లీడ‌ర్లు హ‌డావుడి చేస్తున్నారు. ఎవ‌రు ఎన్ని చేసినా కేసీఆర్ ను ఢీ కొన‌డం క‌ష్ట‌మ‌ని అంటున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు.

This post was last modified on June 2, 2022 4:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్ళీ బిగ్ బ్రేక్ ఇచ్చేసిన రాజమౌళి..

మహేష్ బాబు సినిమాను రాజమౌళి ఈపాటికే మొదలుపెట్టాల్సింది. కానీ పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాతనే ప్రాజెక్టును స్టార్ట్…

39 mins ago

ఐపీఎల్ వేలంలో 13 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ వైభవ్?

ఐపీఎల్ మొదలైన తరువాత క్రికెట్ ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నేటితరం యువకులు అతి చిన్న వయసులోనే క్రికెట్…

48 mins ago

మండ‌లిని ఇలా బ‌లోపేతం చేస్తున్నారు.. బాబు ఐడియా భేష్ ..!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఐడియా వేస్తే.. తిరుగుండ‌దు. అది ఎన్నిక‌లైనా.. రాజ‌కీయాలైనా పాల‌న‌లో అయినా.. ఆయ‌న ఆలోచ‌న‌లు…

1 hour ago

గేమ్ ఛేంజర్ మీద ఒత్తిడి షురూ

పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…

2 hours ago

‘పుష్ప-2’ ఈవెంట్లో రభస రభస

‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్‌ను పిలిచి సింపుల్‌గా చేసేస్తారని అనుకున్నారంతా.…

3 hours ago