రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయింది. ఇది ఏ ప్రభుత్వానికైనా.. చాలా మెజారిటీ కాలం. అయితే.. అనూహ్యంగా జగన్‌కు ఇబ్బందికర పరిణామం ఎదురైంది. కరోనా రావడంతో రెండేళ్ల కాలం కాలగర్భంలో కలిసిపోయింది. దీంతో అభివృద్ధి చేసేందుకు.. పెట్టుబడులు తెచ్చేందుకు కొంత ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యాయనేది వాస్తవం. అయితే.. ఈ విషయాన్ని ప్రొజెక్టు చేసుకుని.. ప్రజలను తమ వైపు తిప్పుకోవడంలో వైసీపీ నాయకులు విఫలమయ్యారు.
ఎందుకంటే.. ఇప్పుడు ఎక్కడా ఈ మాటే వినిపించడం లేదు. మేం అంతిచ్చాం.. ఇంతిచ్చాం.. అని చెబు తున్నారు. అయితే.. సంక్షేమం అందున్నవారు.. ఓకే.. వారు మౌనంగా ఉన్నారు. కానీ, అందని వారే ఎక్కు వ మంది ఉన్నారు. వీరే మౌనంగా ఉంటున్నారు. దీంతో మంత్రులు, సర్కారు చెబుతున్న వాదన బలంగా వెల్లడం లేదు. అదే సమయంలో విపక్షాలు చేస్తున్న అభివృద్ధి లేదనే వాదన బలంగా వెళ్లింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల వాదనను పక్కన పెట్టేలా.. అసలు ఏం జరిగింది! అనే విషయాలను వైసీపీ నాయకులు వినిపించలేక పోయారు.
దీంతో అభివృద్ధి చేయని పార్టీగా. వైసీపీ నిలిచిపోయింది. ఇక, ఇప్పుడు జగన్ ముందు రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. ఈ రెండేళ్లలో ఏం చేస్తారు? ఎలా చేస్తారు? ఏ విధంగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నా రు? అనేది ఆసక్తిగా మారింది. మూడు రాజధానుల నిర్మాణాలను ముందుకు తీసుకువెళ్తారా ? అమరావతినే అభివృద్ది చేస్తారా ? పోలవరం పరిస్థితి ఏంటి ? వెనుకబడిన జిల్లాలను ఎలా అభివృద్ధి చేస్తారు? అనే ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు.
ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. ఇప్పుడు మాత్రం ఎన్నికల మూడ్ వచ్చేసింది. ప్రజలు కూడా తమకు ప్రయోజనం ఉన్న ప్రభుత్వం కావాలనే కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. వైసీపీ సర్కా రు ఇప్పటి వరకు ఏమీ చేయలేదనే భావన ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. దీనికితోడు రాష్ట్రంలో రహదారులు గుంతలు పడడం.. వాటిని కూడా పూడ్చుకోలేక పోవడం వంటివి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే రెండేళ్ల పాటు ఆయన ఏం చేస్తారనేది ప్రశ్నగా మారింది.
This post was last modified on June 2, 2022 7:59 am
సీనియర్ నటుడు సుమంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కొత్త సినిమా మహేంద్రగిరి వారాహి మీద విడుదలకు ముందు మంచి అంచనాలే…
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…