Political News

రేవంత్ తేరుకునేలోగా.. కేసీఆర్ ప్లాన్ స‌క్సెస్

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వ్యూహాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న్ను రాజ‌కీయంగా టార్గెట్ చేయ‌డ‌మే కాకుండా స‌మ ఉజ్జీగా నిల‌బ‌డే నేత‌లు ఎవ‌ర‌న్న ప్ర‌శ్న‌కు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స‌రైన వ్య‌క్తి ప‌లువురు ప్ర‌తిపాదిస్తుంటారు. దీనికి రేవంత్ రెడ్డి అనుస‌రించే వ్యూహాలు, చేసే విమ‌ర్శ‌లు వంటివి కార‌ణంగా పేర్కొన‌వ‌చ్చు. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ వేసిన గేమ్ ప్లాన్ లో రేవంత్ రెడ్డి ఇరుక్కున్నార‌ని… రేవంత్ రెడ్డి దూకుడే ఆయ‌న‌కు శాపంగా మారాయని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

తాజాగా కాంగ్రెస్ పార్టీలో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లే దీనికి తార్కాణ‌మ‌ని అంటున్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యుల విష‌యంలో టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి దూకుడు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. గులాబీ ద‌ళ‌ప‌తి స‌హా ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై విమ‌ర్శ‌ల‌కు కాంగ్రెస్ శ్రేణులు మొద‌ట్లో మ‌ద్దతు ఇచ్చిన‌ప్ప‌టికీ వ‌రుస‌గా అవే కామెంట్లు చేయ‌డం పార్టీలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని అంటున్నారు.

రేవంత్ వ్యాఖ్య‌ల వ‌ల్ల కేవలం కేసీఆర్ కుటుంబ టార్గెట్‌గా మాత్రమే కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉందని, అసలు సమస్యలను వదిలేశార‌ని సంకేతాలు రాష్ట్రంలోకి వెళ్లాయని కాంగ్రెస్ పార్టీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. రెడ్డిలకు రాజ్యాధికారం అనే నినాదాన్ని రేవంత్ రెడ్ది తీసుకురావ‌డంతో రాజకీయాలు కులం, కుటుంబం టార్గెట్‌‌గా మారాయని పార్టీ సీనియర్లు ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యేల నుంచి మొదలుకుని మంత్రుల వరకు విమర్శలకు దిగుతున్నప్ప‌టికీ కాంగ్రెస్ నుంచి కౌంటర్ రాక‌పోవడం గురించి విశ్లేషకులు ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తున్నారు.

తాజాగా జ‌రుగుతున్న చింత‌న్ శిబిర్ సైతం పార్టీలోని అసంతృప్తుల‌కు నిద‌ర్శ‌మ‌ని చెప్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలసీని ప్రకటించే చింతన్ శిబిర్ రేవంత్ రెడ్డి లేకుండానే నిర్వహించేస్తున్నారు. ఇప్పటిదాకా పార్టీలో ఎంతమంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినా, సడెన్‌గా రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించినా పార్టీలో నిర్ణ‌య‌మే ఫైన‌ల్‌ అనే ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు అధిష్టానం దగ్గర రేవంత్ గ్రాఫ్ డౌన్ అయిందనే ఫీలింగ్‌లో ఉండ‌టం వ‌ల్లే కాంగ్రెస్ సీనియ‌ర్లు ఈ ర‌కంగా త‌మ ఎజెండాతో ముందుకు సాగుతున్నార‌ని అంటున్నారు.

This post was last modified on June 1, 2022 5:48 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

ఒక‌రు తీర్థ యాత్ర‌లు.. మ‌రొక‌రు విదేశీ యాత్ర‌లు!

ఏపీలో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఒక‌వైపు తీవ్రమైన హింస చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్ర‌తిపక్ష నాయ‌కులు…

3 hours ago

పోలీసులు ఏంచేస్తున్నారు.. చంద్ర‌బాబు ఆవేద‌న‌

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, తాడిప‌త్రి ప్రాంతాల్లో చెల‌రేగిన హింస‌పై చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం…

3 hours ago

ఏపీ హింస‌.. నిప్పులు చెరిగిన ఈసీ..

రాష్ట్రంలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ముగిసిన త‌ర్వాత చెల‌రేగిన తీవ్ర హింస‌ పై కేంద్ర ఎన్నికల సంఘం…

9 hours ago

దెయ్యాన్ని ప్రేమించే ‘లవ్ మీ’ కుర్రాడు

https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…

16 hours ago

రవితేజ సమస్యే నానికి వచ్చిందా

కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు…

18 hours ago

విశ్వంభరలో స్టాలిన్ అక్కయ్య

చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ…

19 hours ago