నగ్మా.. తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మారిచిపోయే పేరు కాదిది. ఘరానా మొగుడు సహా 90వ దశకంలో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించి నిన్నటితరం ప్రేక్షకుల మనసుల్లో బలమైన ముద్ర వేసిన ఉత్తరాది భామ ఆమె. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు.. ఇలా అప్పటి టాప్ స్టార్లు అందరితోనూ సినిమాలు చేసిన నగ్మా.. ఫిలిం కెరీర్ ముగిశాక మళ్లీ ముంబయికి వెళ్లి సెటిలైపోయింది.
అక్కడి నుంచే ఆమె రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టింది. 2004లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరి మధ్యలో ఏ పార్టీ వైపూ చూడకుండా అందులోనే ఆమె కొనసాగడం విశేషం. పార్టీ పరంగా ఆమెకు కొన్ని పదవులు వచ్చాయి కానీ.. అంతకు మించి అధికారిక పదవులేవీ ఆమెకు దక్కలేదు. 2014 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాక ఆమె పొలిటికల్ గ్రాఫ్ పడిపోయింది.
ఐతే సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవ చేస్తుండటం, ప్రతిసారీ ఎన్నికల ప్రచారంలో బాగా కష్టపడుతుండటంతో నగ్మా రాజ్యసభ సభ్యురాలిగా పార్టీ తరఫున నామినేట్ అవుతుందని విశ్లేషకులు భావించారు. ఈ పర్యాయం అవకాశం దక్కుతుందని అంచనా వేసిన వాళ్లలో నగ్మా కూడా ఒకరు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆమెకు మొండిచెయ్యే చూపించింది. దీంతో నగ్మాకు మండిపోయింది. ఆమె నేరుగా పార్టీ అధినాయకత్వం మీదే విమర్శలు గుప్పించింది.
తనకు ఎంపీగా అవకాశం కల్పిస్తానని 2004లో స్వయంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన హామీ మేరకే తాను కాంగ్రెస్‌లో చేరానని.. ఇన్నేళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నా తనకు అవకాశం ఇవ్వలేదని.. తాను తక్కువ అర్హత కలిగినదాన్నా అంటూ ఆమె ట్విట్టర్లో నేరుగా కాంగ్రెస్ అధినాయకత్వానికి ప్రశ్న సంధించారు. 2004లో నగ్మా ముందు బీజేపీలో చేరుతుందని వార్తలొచ్చాయి. కానీ ఆమెకు పదవి ఆశచూపే కాంగ్రెస్‌లోకి లాగినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో నగ్మా ఆవేదన సరైందే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on May 30, 2022 11:37 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…