కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యులుగా నామినేట్ అయిన వారిలో సీనియర్లు, జూనియర్ల మేలు కలయికగా అధినేత్రి సోనియాగాంధీ ఎంపిక చేశారు. సీనియర్లు చిదంబరం, జై రామ్ రమేష్ ఉన్నారు. అలాగే రణదీప్ సుర్జేవాలా, అజయ్ మాకెన్, మాజీ ఎంపీ పప్పూయాదవ్ భార్య రంజీత్ రంజన్, ఇమ్రాన్ ప్రతాప్ గర్హి, ప్రమోద్ తివారి లాంటి వాళ్ళను సోనియా ఎంపికచేశారు. ఇదే సమయంలో ఎంతగా ప్రయత్నించినా సీనియర్లలో అత్యంత ప్రముఖుడైన గులాంనబీ ఆజాద్ కు అవకాశం దొరకలేదు.
ఈ విషయం సోనియా మంచి నిర్ణయమే తీసుకున్నారు. రాజ్యసభ నామినేట్ చేయకపోవటంలో సోనియా నిర్ణయాన్ని పార్టీలోని చాలామంది హ్యాపీగా ఫీలవుతున్నారు. నిజానికి దశాబ్దాల పాటు ఆజాద్ కాంగ్రెస్ ప్రముఖుడిగా అపరిమితమైన అధికారాలను అనుభవించారు. కేంద్రమంత్రి హోదాలో ఎన్నో రాష్ట్రాలకు ఇన్చార్జిగా ఉన్నారు. చేసినంత కాలం కేంద్రమంత్రిగా పనిచేసి జమ్మూ-కాశ్మీర్ లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వెంటనే కేంద్రమంత్రిగా రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా నామినేట్ అయిపోయారు.
అంటే రాజ్యసభ ఎంపీ అవకాశమైనా, కేంద్రమంత్రి పదవి అయినా, సొంత రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా తానే ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు కేంద్రంలో అనేక పదవుల్లో చక్రంతిప్పిన ఆజాద్ ఇపుడు పార్టీలో చాలా లోపాలున్నాయంటు పదే పదే సోనియాకు లేఖలు రాసి సంచలనాలు సృష్టిస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనేక రాష్ట్రాల్లో అధికారంలో బలంగా ఉండి చివరకు బలహీనమైపోవటంలో ఆజాద్ బాధ్యత కూడా ఉంది. తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిస్సా, బీహార్ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇన్చార్జిగా ఆ రాష్ట్రాల్లో పార్టీ దెబ్బతినటానికి ఆజాద్ కూడా పరోక్షంగా కారకుడే.
ఇపుడు కాంగ్రెస్ అత్యంత బలహీనంగా ఉన్న సమయంలో నాయకత్వం మార్పు కావాలని బహిరంగంగా రచ్చ చేస్తు సోనియాను బాగా ఇబ్బంది పెడుతున్న ఆజాద్ అంటే పార్టీలోనే బాగా అసంతృప్తి పెరిగిపోతోంది. ఇదే సమయంలో ఆజాద్ ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీచేయబోతున్నారనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. నరేంద్రమోడి దూతలుగా ఇప్పటికే ఆజాద్ ను కొందర కలిశారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆజాద్ పై అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకనే సోనియా కూడా రాజ్యసభకు దూరం పెట్టేశారు.
This post was last modified on May 30, 2022 1:53 pm
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…