తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలకు ఆ పార్టీ ఢిల్లీ పెద్దలు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఏపీలో అధికార వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్‌పై కాషాయ నేతలు చేస్తున్న పోరాటానికి.. జాతీయ నాయకత్వం కాస్త అధికార బలాన్ని అందించే ఆలోచనలో ఉందని టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపేందుకు.. ఓ నాయకుడిని ఎంపిక చేయాల్సి వస్తే వీరినే పరిశీలిస్తున్నారని పలువురు పేర్లు వినిపించాయి. అయితే, వీరందరికీ షాక్ ఇస్తూ రాజ్యసభ అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది.
8 రాష్ట్రాల నుంచి 16 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నేతల పేర్లు లేవు. కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్‌కు మరోసారి అవకాశం ఇచ్చారు. మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్‌కు అవకాశం కల్పించారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఏపీ కంటే తెలంగాణ పై ఎక్కువ చర్చ జరిగింది. అమిత్ షా టూర్ తర్వాత.. తెలంగాణ బీజేపీలో పరిణామాలు, రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయ్.
వచ్చే ఎన్నికల్లో.. అధికారం దక్కించుకోవాలంటే.. మరింత పోరాడాలని జాతీయ నాయకత్వం భావిస్తోందనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర స్థాయి నేతలు చేస్తున్న పోరాటానికి.. వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న జాతీయ నాయకత్వం.. ఇక్కడి నాయకులకు కొంత అధికార బలాన్ని కూడా అందించాలన్న ఆలోచనలో ఉన్నట్లు పార్టీ ఆఫీసులో గుసగుసలు వినిపిస్తున్నాయ్.
ఇందుకోసం రాష్ట్రం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న నేతలను రాజ్యసభకు పంపితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారని.. పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రాజ్యసభకు పంపాల్సి వస్తే.. ఎవరిని పంపుతారు? ఏ స్టేట్.. కోటాలో పంపుతారని.. పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ సమయంలోనేనేతల పేర్లను ఖరారు చేస్తూ వేరే రాష్ట్రలా నాయకుల పేర్లు ఢిల్లీ పెద్దలు విడుదల చేశారు.
తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ పడనున్న బీజేపీ అభ్యర్థులు వీరే :
– నిర్మల సీతారామన్, జగ్గేశ్ ( కర్ణాటక )
– పీయూష్ గోయల్, అనిల్ సుఖ్‌దేవ్ రావ్ బొండే ( మహారాష్ట్ర )
– లక్ష్మికాంత్ వాజ్‌పేయి, రాధామోహన్ అగర్వాల్, సురేంద్రసింగ్ నగర్, బాబురామ్ నిషద్, దర్శణ సింగ్, సింగీతా యాదవ్(ఉత్తరప్రదేశ్)
– సతీష్ చంద్ర, శంభు శరణ్ ( బీహార్ )
– కృష్ణలాల్ ( హర్యానా )
– సుశ్రి కవితా పటిదార్ ( మధ్యప్రదేశ్ )
– గణశ్యామ్ తివారీ ( రాజస్థాన్ )
కల్పనా సైనా ( ఉత్తరాఖండ్ )
This post was last modified on May 30, 2022 9:25 am
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…