ఇపుడిదే విషయం పార్టీ నేతల మధ్య బాగా చర్చ జరుగుతోంది. పనిలోపనిగా మహానాడులో కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే విజయవాడ ఎంపీ కేశినేని నానికి పోటీగా సొంత తమ్ముడు కేశినేని చిన్ని పార్టీలో హైలైట్ అవుతున్నారు. ఈయన కొంతకాలంగా సొంత ఖర్చులతో అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో చంద్రబాబు నాయుడు, లోకేష్ తో పాటు తన ఫొటోలను మాత్రమే చిన్ని పెట్టారు. స్వయానా సోదరుడైనా నాని ఫొటో మాత్రం కనబడలేదు.
ఇదే సమయంలో చంద్రబాబు, లోకేష్ తో చిన్ని రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఎంపీ నానితో పార్టీలోని అంటే విజయవాడలోని చాలామంది నేతలకు ఏ మాత్రం పడటం లేదు. ముఖ్యంగా దేవినేని ఉమ, బుద్ధా వెంకన్న, బోండా ఉమ, నాగుల్ మీరా లాంటి సీనియర్ నేతలతో ఎంపీకి ఏ మాత్రం పొసగటం లేదు. వీళ్ళ మధ్య ఆధిపత్యం గొడవల కారణంగా పార్టీ పరువు బజారున పడింది. వీళ్ళ మధ్య సయోధ్య కుదిర్చేందుకు చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
వీళ్ళ మధ్య గొడవలను సెటిల్ చేయలేక చంద్రబాబు కూడా ఈ గ్రూపులను వదిలేశారు. దాంతో ఎంపీకి వ్యతిరేకంగా పై నేతలదే పై చేయిగా వ్యవహారాలు సాగుతోంది. దాంతో ఎంపీకి తీవ్ర ఆగ్రహం వచ్చింది. దాంతో అలిగి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే అదునుగా నాని సోదరుడు చిన్నిని పార్టీ నేతలు దువ్వుతున్నారు. దాంతో చిన్ని కూడా పార్టీలో యాక్టివ్ అయిపోయారు. దీనికి సాక్ష్యమే ఎంపీ మహానాడుకు గైర్హాజరవటం. ఒంగోలులో జరుగుతున్న మహానాడుకు హాజరుకాకుండా ఎంపీ ఢిల్లీలో కూర్చున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా స్థిరపడిన చిన్నినే ఎంకరేజ్ చేయటం వల్ల పార్టీకి బాగా లాభం ఉంటుందని పార్టీ నేతలు చంద్రబాబు, లోకేష్ కు చెప్పారట. పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో చిన్ని ఏదో ఒక నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేయటమో లేకపోతే ఎంపీగా పోటీ చేయటమో ఖాయమనే అనిపిస్తోంది. చూద్దాం చివరకు ఏమవుతుందో.
This post was last modified on May 28, 2022 10:14 am
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…