శ్రీసత్యసాయి జిల్లాలోని హిందూపురంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే, నటుడు.. నందమూరి బాలయ్యను ఇక్కడ పర్యటించేందుకు పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాదు.. ఆయన వెళ్లేందుకు వీలు లేదంటూ.. పోలీసులు.. నిలిపివేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఏం జరిగింది?
శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. పాత కక్షల నేపథ్యంలో తెలుగుదేశం మాజీ సర్పంచ్ బాలాజీ ఇంటిపైకి వైసీపీ వర్గీయులు రాళ్లు రువ్వారు. అడ్డొచ్చిన టీడీపీ శ్రేణులను.. కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. క్షతగాత్రుల ను చిలమత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాలయ్య ఎందుకు వచ్చారు?
చిలమత్తూరులో జరిగిన వైసీపీ, టీడీపీ వర్గీయుల దాడిలో గాయపడిన టీడీపీ నాయకులను, కార్యకర్తలను పరామర్శించేందుకు బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో పర్యటనకు వచ్చారు. అయితే.. చిలమత్తూరు మండలం కొడికొండ వద్ద బాలక్రిష్ణను పోలీసులు అడ్డుకున్నారు. కొడికొండలో మూడు రోజుల క్రితం జరిగిన జాతర టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణకు దారితీసిందని.. ఈ ఘర్షణలో గాయపడ్డ టీడీపీ నేతలను పరామర్శించేందుకు వచ్చానని బాలక్రిష్ణ చెప్పినా.. పోలీసులు ససేమిరా అన్నారు.
చివరకు బాలయ్యపట్టుబట్టడంతో గ్రామంలోకి కన్వాయి వద్దని కేవలం ఎమ్మెల్యే బాలక్రిష్ణ వాహనాన్ని మాత్రమే పోలీసులు అనుమతించారు. బాలక్రిష్ణ రాకతో భారీగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు ఆయనను అనుసరించేందుకు కూడా పోలీసులు అనుమతించలేదు.
బాలయ్య ఫైర్
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ… టీడీపీ కార్యకర్తలపై దాడిని తీవ్రంగా ఖండించారు. గ్రామాల్లో కక్షలు రేపే విధంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. మళ్లీ మా కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. మేం కూడా తిరగబడుతాం.. ఖబడ్దార్ మీకు తగిన శాస్తి చేస్తాం అని హెచ్చరించారు. ఎంపీ మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ ను తరిమికొట్టే పరిస్థితి వచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి లేదు.. అంతా బాదుడే బాదుడు అని విరుచుకుపడ్డారు. మట్టి నుంచి అన్నింటా దోపిడీ పర్వమే కొనసాగుతోందని విమర్శించారు.
This post was last modified on May 27, 2022 4:56 pm
మహేష్ బాబు సినిమాను రాజమౌళి ఈపాటికే మొదలుపెట్టాల్సింది. కానీ పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాతనే ప్రాజెక్టును స్టార్ట్…
ఐపీఎల్ మొదలైన తరువాత క్రికెట్ ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నేటితరం యువకులు అతి చిన్న వయసులోనే క్రికెట్…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఐడియా వేస్తే.. తిరుగుండదు. అది ఎన్నికలైనా.. రాజకీయాలైనా పాలనలో అయినా.. ఆయన ఆలోచనలు…
పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…
‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్ను పిలిచి సింపుల్గా చేసేస్తారని అనుకున్నారంతా.…