నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ మార్గంలోని ఉజ్వల్ భారత్ సాధించాలన్న కోరిక కేసీయార్ లో బలంగా ఉంది. అయితే ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతారన్నదే కీలకమైన పాయింట్. కారణం ఏమిటంటే నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ అంటేనే జరిగే పని కాదన్న విషయం అందరికీ తెలుసు. ఏకకాలంలో రెండు జాతీయ పార్టీలను దూరంగా పెట్టి జాతీయ స్ధాయిలో మూడో కూటమిని ఏర్పాటు చేయటం సాధ్యమయ్యే పని కాదు.
మూడో కూటమిని ఎవరు తీసుకురావాలన్నా కచ్చితంగా పై రెండు కూటమిలోని ఏదో ఒకదాని మద్దతు లేకుండా జాతీయ రాజకీయాలు నడపటం జరిగే పని కాదు. దశాబ్దాలపాటు రాజకీయాల్లో ఉన్న కేసీయార్ కు ఇంత చిన్న విషయం అర్థం కాకపోవడమే విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ ను దూరం పెట్టి జాతీయ రాజకీయాల్లో ఎన్డీయేకి వ్యతిరేకంగా రాజకీయం చేయటం సాధ్యం కాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్, డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చెప్పినా కేసీయార్ చెవికెక్కలేదు.
అందుకనే కేసీయార్ ప్రయత్నాలను ఆ మధ్య ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. దాంతో తనకు ఎవరూ మద్దతివ్వడం లేదన్న విషయాన్ని గ్రహించి కేసీయార్ కూడా కామ్ గా ఉండిపోయారు. అయితే కొంతకాలం గ్యాప్ ఇచ్చి మళ్ళీ యాక్టివ్ అవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. తాజాగా ఢిల్లీలో కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, బెంగుళూరులో మాజీ ప్రధానమంత్రి దేవేగౌడతో భేటీ అయ్యారు. ఉజ్వల్ భారత్ సాధనే తన టార్గెట్ గా చెప్పుకుంటున్నారు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే తన బలాన్ని కేసీయార్ వాస్తవానికి మించి చాలా ఎక్కువగా అంచనా వేసుకున్నారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసలే క్రెడిబులిటి తక్కువ దానికి తోడు ఒంటెత్తు పోకడ తో వెళుతున్నారు. ఈ కారణంతోనే నాన్ కాంగ్రెస్ సీఎంలు పెద్దగా సానుకూలంగా ఉన్నట్లులేరు. ఈ నేపధ్యంలోనే మూడునెలల్లో సంచలనాలు చూస్తారు, సంచలన వార్తచెబుతా అంటు కొత్తరాగం మొదలుపెట్టారు. మరిది ఎంతవరకు వర్కవుటవుతుందో ఏమో చూడాల్సిందే.
This post was last modified on May 27, 2022 1:49 pm
అనుకున్నంతా అయ్యింది. అధికార పార్టీ టీడీపీ వ్యూహాల ముందు విపక్ష వైసీపీ వ్యూహాలు ఫలించలేదు. రాజకీయాలకు కొత్తే అయినా గుంటూరు…
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించడం ఈ రోజుల్లో పెద్ద సవాళుగా మారింది. తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, పిల్లలు తమ…
రాజకీయ సన్యాసం తీసుకున్న వైసీపీ మాజీ విజయసాయిరెడ్డికి సంబంధించిన రహస్యాలు ఒక్కొక్కటిగానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ విషయం…
ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…
భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్‌ను ప్రారంభించింది. ‘స్వరైల్…