మరో 30 ఏళ్లు తెలుగుదేశం పార్టీ నడవాలన్నది అధినేత ఆకాంక్ష. నిరాటంకంగా నడవాలన్నది అధినేత ఆలోచన. అందుకు ఏం చేయాలో సూచన ప్రాయంగా కొన్ని విషయాలు ఇప్పటికే లోకేశ్ కు చెప్పారు. ఆ విధంగా ఆయన నడుచుకుంటే, నడవడి దిద్దుకుంటే మంచి ఫలితాలే వస్తాయన్నది ఓ ప్రతిపాదన అయితే ఉంది. ముఖ్యంగా సమర్థ నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలన్నదే బాబు ఆకాంక్ష. వచ్చే ఎన్నికలు ఒక్కటే కాదు రెండు లక్ష్యాలు బాబు ముందున్నాయి. వయసు రీత్యా ఆయన పెద్దవారు అయిపోతున్నారు. ఏడు పదులు దాటేశారు ఇప్పటికే. ఈ సమయంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు ఎదిగి ఉన్నాయి. ఈ తరుణంలో పార్టీలో ప్రత్యామ్నాయ నాయకులను తయారు చేయాలి. ఫ్యూచర్ లీడర్ ఎవరు అన్న ప్రశ్నకు ఇతడే అన్న సమాధానం లోకేశ్ కావాలి.
తాజాగా మహానాడు వేదికగా కొన్ని మార్పులు రానున్నాయి. లోకేశ్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేయాలన్న ఆలోచన కూడా చంద్రబాబు మనసులో ఉంది. అయితే లోకేశ్ దిశా నిర్దేశకత్వంలో పార్టీ ఏ మేరకు పరుగులు తీయగలదు అన్న సంశయాలూ ఉన్నాయి. అందుకే పార్టీలో లోకేశ్ నాయకత్వాన్ని సమర్థించే వారి సంఖ్య అన్నది ఏ మేరకు ఉన్నది అన్నది ముఖ్యం. అధికారంలో ఉండగా కొన్ని తప్పిదాలు జరిగాయి. వాటిని సవరించే క్రమంలో బాబు ఉన్నారు. ఇదే సమయంలో లోకేశ్ కారణంగా కొన్ని తప్పిదాలు జరిగాయి అన్న వార్తలు వచ్చాయి. వాటిని దిద్దుకోలేని స్థితిలో ఉన్నారు. కనుక తప్పులు దిద్దుకోవడం అన్నది ఓ బాధ్యత అయితే లోకేశ్ మంచి నాయకులుగా అవతరించే అవకాశాలే మెండు.
టార్గెట్ 2024 .. విజన్ 2050
రానున్న రెండేళ్లూ కీలకం.. పార్టీ ఎదుగదలకు చాలా కీలకం. ఇలాంటి సమయాన పార్టీని ప్రక్షాళన చేయాలని యోచస్తున్నారు చంద్రబాబు. అదేవిధంగా జగన్ కు దీటుగా పనిచేసే రాజకీయ శక్తుల ఏకీకరణకు ప్రాధాన్యం ఇస్తూనే లోకేశ్ ను ఫ్యూచర్ లీడర్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. మరోవైపు రానున్న 30 ఏళ్ల కాలానికి పార్టీని నడిపే శక్తి కావాలి. క్రియాశీలక రాజకీయాల్లో పార్టీ తడబడకుండా పనిచేయగలగాలి. అందుకు కూడా ఈ మహానాడు వేదికను వినియోగించుకుని, కొన్ని సూచనలు కార్యకర్తలకు చేయనున్నారు చంద్రబాబు. ఏ విధంగా చూసుకున్నా ఈ మహానాడు పార్టీకీ బాబూకూ ఎంతో ముఖ్యం.
This post was last modified on May 27, 2022 11:03 am
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…