రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు.. ఎక్కడికక్కడ అధికార పార్టీ నేతలు చెలరేగుతున్న పరిస్థితిపై.. పొరు గు రాష్ట్రాలనుంచి ఇప్పటికే అనేక విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువవుతున్నాయ ని మేధావులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు, ఎస్సీలకు ఏపీలో రక్షణ లేదని.. ఇప్పటికే దళిత సంఘాలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
అయినప్పటికీ.. ప్రభుత్వం వీటికి విపక్ష నేతల విమర్శల ఖాతాల్లోకి నెట్టేస్తోంది. పైగా..నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. అయితే.. ఇప్పుడు తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి, ఏపీలోనూ గతంలో పనిచేసిన ఎం. నాగేశ్వరరావు.. ఏపీ సర్కారు తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ముఖ్యంగా కోనసీమలో తాజాగా జరిగిన అలజడి.. మంత్రి, ఎమ్మెల్యే ఇల్లు తగలబెట్టిన ఘటన.. ఈ ఘటనల్లో పోలీసులకు గాయాలు కావడం.. వీటిని ప్రభుత్వం .. ఓ వర్గంపై నెట్టేయాలని చూడడం వంటి విషయాలు చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావు చిత్రంగా రియాక్ట్ అయ్యారు. అది కూడాముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి నేరుగా ఆయన వ్యాఖ్యలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును `వైఎస్సార్ రాష్ట్రం`గా పేరు మార్చాలని ఆయన జగన్‌కు సూచించారు.
అదేసమయంలో ఆయన మరో వ్యాఖ్య కూడా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు తెలుగు మీడియంను ఎత్తేస్తున్న నేపథ్యంలో దీనిపైనా సటైర్ వేశారు. “తెలుగును ఎలాగూ తెగులుగా భావిస్తున్నాం.. కాబట్టి.. వైఎస్ ఆర్ రాష్ట్రాన్ని `వైఎస్సార్ ల్యాండ్`గా పేర్కొనండి అంటూ.. నాగేశ్వరరావు సలహా ఇచ్చారు. మొత్తానికి ప్రభుత్వ వైఖరిపై అటు.. ఉన్నతాధికారుల్లోనూ.. తీవ్రస్థాయిలో విమర్శలు వస్తుండడం గమనార్హం. మరి వీటిపై ప్రభుత్వ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on May 25, 2022 7:19 pm
పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…
‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్ను పిలిచి సింపుల్గా చేసేస్తారని అనుకున్నారంతా.…
ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది ఆమె నుంచి వరుసగా క్రేజీ…
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు,…
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడైనంత మాత్రాన చట్టాలు పాటించరా? అని…
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి సోమవారం ఒకే సమయంలో ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై సోమవారం…