రాజకీయాలన్నవి రిజల్ట్ ఓరియెంటెడ్. మంచి జరిగితే ఓ మాట, చెడు జరిగితే నాలుగు మాటలు వినిపించడం వెరీ కామన్. ఇవేవీ లేకుండా పరిణామాలను అంగీకరించడం విశ్లేషించడం వివరించడం అన్నవి జరగని పని! రేపటి నుంచి సామాజిక న్యాయభేరి పేరిట జగన్ క్యాబినెట్ కు చెందిన బీసీ, ఎస్టీ మంత్రులు బస్సు యాత్ర చేయనున్నారు. శ్రీకాకుళం నుంచీ యాత్ర ప్రారంభించనున్నారు.
ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. బీసీలను ఆదుకుంటున్న ప్రభుత్వం తమదేనన్న బలమైన ప్రతిపాదనతోనూ, సంబంధిత అజెండాతోనూ మంత్రులు మాట్లాడనున్నారు. ఇలాచేస్తే జనం జగన్ కు జేజేలు పలుకుతారు అన్నది ఓ అభిప్రాయం వైసీపీ వర్గాల్లో ఉంది.
ఇదే సమయంలో బీసీ సంక్షేమం పేరిట ఇస్తున్న నిధులు ఎన్ని వాటికి సంబంధించి కేటాయింపులు ఎన్ని అన్న వాటిపై ఓ లెక్క తేల్చాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. వాస్తవానికి వైసీపీ వచ్చాక బీసీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందన్నది వారి వాదన. ఒక్క బీసీ కార్పొరేషన్ మాత్రమే కాదు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన కార్పొరేషన్లు కూడా ఆర్థికంగా పూర్తిగా అతీగతీ లేకుండా పోయాయి. ఇదివరకూ వీళ్ల కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థల నేతృత్వంలో ట్రైనింగ్ సెంటర్లు నడిచేవి. ఇప్పుడవి లేకుండా పోయాయి.
వీలున్నంత వరకూ సంక్షేమ పేరిట పథకాలను ప్రకటిస్తూ ఉన్నారే తప్ప వాటికి కేటాయించే నిధులు కొన్ని సక్రమంగా వినియోగానికి నోచుకోవడం లేదు. అర్హుల లెక్క అంతా కప్పల తక్కెడ మాదిరిగా ఉందన్నది ఓ వర్గం వాదన. ఈ తరుణంలో మంత్రులు ధర్మాన కానీ బొత్స కానీ ఉత్తరాంధ్ర కోటరీలో తమ సత్తా నెగ్గించుకోవాలని అన్నారు. అవి సాధ్యం అవుతాయో లేదో రేపటి వేళ నుంచి పరిశీలించాలి.
This post was last modified on May 25, 2022 5:36 pm
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…