వచ్చే ఎన్నికలకు, నడుస్తున్న పరిణామాలకూ మధ్య పొంతన అయితే ఉంది. పొత్తులు లేదా ఒప్పందాలు అన్నవి ఇప్పటికిప్పుడు తేలేవి కావు. కానీ జనసేనాని ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామని చెప్పడంతో వైసీపీ మరింత వివాదాన్ని పెంచింది. ఓ నాయకుడు గెలిచినా, ఓడినా జగన్ ఇమేజ్ ఏమీ పెరిగిపోదు కానీ, పవన్ లాంటి లీడర్లను ఓడిస్తే మాత్రం ఆయనకు ఓ విధంగా ప్లస్ కానుంది. మాట్లాడే నాయకులలో కొందరు మరీ అతిగా స్పందిస్తున్నా, జనసేన వాటిని తిప్పికొడుతుంది.
కానీ ఒకవేళ జనసేన వచ్చేసారి కూడా ఓడిపోతే అప్పుడు వైసీపీ ఇంకొంత బలపడడం ఖాయం. అయినా గెలుపా ఓటమా అన్నవి పవన్ పట్టించుకోడు కనుక వైసీపీ కూడా కాస్త జాగ్రత్తగానే మాట్లాడితే బెటర్ అని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికిప్పుడు బీజేపీ బీజియంతో టీడీపీ గొంతు కలపదు అని తేలిపోయింది. కనుక బీజేపీ ని ఒంటరి చేసి జనసేన టీడీపీతో కలిసే ఛాన్స్ ఉందని ఉండవల్లి లాంటి వెట్రన్ పొలిటీషియన్లు అంటున్నారు.
ఒకవేళ అదే కనుక జరిగితే 2014 నాటి రిజల్ట్ రిపీట్ కావొచ్చు. పొత్తుల్లో భాగంగా పవన్ మనుషులను గెలిపించాల్సిన బాధ్యత చంద్రబాబుదే! ఆ విధంగా చంద్రబాబు నడుచుకోకపోతే నష్టం టీడీపీకే ! అందుకే వైసీపీ కి మళ్లీ ఓ 70 సీట్లు రావడం ఖాయం. అంతేకానీ ఓ మీడియా బాకాలు ఊదుతున్న విధంగా యాభై ఒక్క శాతం ఓటర్లు వైసీపీ వైపే ఉన్నారు అన్నది ఓ అబద్ధం. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకోకుండా మాట్లాడడం కూడా తప్పే ! అని అంటోంది టీడీపీ.
తమ కారణంగానే చంద్రబాబు మనసు మారి, కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నారని, తమ కారణంగానే బీసీలను చంద్రబాబు నెత్తిన పెట్టుకుంటున్నారని, తమ కారణంగానే లోకేశ్ కూడా ప్రజా పోరాటాలకు సై అంటున్నారు అని వైసీపీ అంటోంది. బాగుంది. అంటే ఓ విధంగా తాము బలపడేందుకు ఉన్న అవకాశాలన్నింటినీ మెరుగుపరుస్తున్నది మీరే అన్న మాట అని టీడీపీ నాయకులు వైసీపీని ఉద్దేశించి అంటున్నాయి. ఈ దశలో బాబు అలానే ఉండిపోక బస్సు యాత్ర చేస్తే బాగుంటుంది. అది కూడా మంత్రుల బస్సు యాత్రకు దీటుగా ఓ టూర్ వేస్తే బాగుంటుంది అని కూడా ఓ వాదన వినిపిస్తోంది.
కానీ వయస్సు రీత్యా చంద్రబాబు ఎండల్లో తిరగలేరేమో అన్న మాట కూడా వినిపిస్తుంది. ఏదేమయినా టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీ విజయావకాశాలు తగ్గిపోవడం ఖాయం. అదేవిధంగా సామాజిక న్యాయ భేరి పేరిట జరిగే బస్సు యాత్రకు పోటీగా టీడీపీ కనుక జనంలోకి వెళ్తే ఇంకాస్త మంచి ఫలితాలు కూడా దక్కుతాయి అని పార్టీ అభిమానులు చెబుతున్నారు. కనుక పొత్తుల విషయమై టీడీపీ వేగంగా తేల్చుకుంటే వైసీపీ వేగాన్ని నిలువరించడం అసాధ్యం అయితే కాదు.
This post was last modified on May 25, 2022 11:11 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…