ఇంకో 20 ఏళ్లలో కేటీఆర్ ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని ఆశా జడేజా మెత్వాణీ వ్యాఖ్యానించారు. సుస్పష్టమైన లక్ష్యం, దానిని అర్థంచేసుకునేలా వ్యక్తీకరించగల నేర్పు ఉన్న ఇలాంటి యువ రాజకీయనాయకుడిని తాను చూడలేదని ఆమె పొగిడారు. తెలంగాణ బృందం అద్భుతంగా రాణిస్తోందని ఆమె మెచ్చుకున్నారు. సిలికాన్ వ్యాలీ స్టార్టప్ రోజులను గుర్తుచేశారని ప్రస్తావించారు. భవిష్యత్‌లో బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
వాక్చాతుర్యంతో శ్రోతలను మంత్రముగ్దులను చేయగల నేర్పు తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. తెలుగు రాష్ట్రాల్లో చక్కటి వాగ్దాటి కలిగిన అతికొద్ది మంది రాజకీయ నేతల్లో ఆయన కూడా ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాజకీయ ప్రసంగాలే కాకుండా ఎన్నో అంతర్జాతీయ స్థాయి వ్యాపార, వాణిజ్య సదస్సుల్లోనూ ప్రసంగించి తనదైన శైలిలో ఫిదా చేశారు. తాజాగా మరో అంతర్జాతీయ వేదికపై తన ప్రసంగానికి ఎంతటి ఆకర్షణీయత ఉందో ఆయన చాటిచెప్పుకున్నారు.
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి కేటీఆర్ సారధ్యంలోని తెలంగాణ బృందం దూసుకెళ్తోంది. ఇన్వెస్టర్లతో వరుస సమావేశాలు, రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య అనుకూల పరిస్థితులను ఇన్వెస్టర్లకు వివరించడంలో మంత్రి కేటీఆర్ బృందం తన కార్యదక్షతను చాటుకుంటోంది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. స్పష్టమైన లక్ష్యంతో కూడిన తన ఆలోచనను ఇన్వెస్టర్లకు తెలియజేయడంతో సఫలీకృతమవుతున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ పనితీరుని గమనించిన ఆశా జడేజా మెత్వాణీ అనే ఓ ఏంజెల్ ఇన్వెస్టర్ నుంచి ఆయనకు గుర్తుండిపోయే ప్రశంస ఇచ్చారు.
This post was last modified on May 25, 2022 11:21 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…