గ్లోబల్ పీస్ మిషన్ పేరుతో క్రిస్టియన్ ప్రచార, సేవా సంస్థను నెలకొల్పి ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ.. పెద్ద పెద్ద దేశాల అధినేతలతో వన్ టు వన్ మీటింగ్‌ల్లో పాల్గొంటూ తిరుగులేని పాపులారిటీ సంపాదించిన వ్యక్తి కేఏ పాల్. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూడటం ద్వారా వైఎస్‌కు టార్గెట్‌గా మారి.. బాగా అన్ పాపులర్ అయిపోయారు పాల్.
సోదరుడి హత్య కేసు, ఆర్థిక వివాదాలు తలకు చుట్టుకోవడం, ఈ క్రమంలోనే కొంత మేర మెంటల్ బ్యాలెన్స్ దెబ్బ తినడంతో ఆయన క్రమంగా ఒక పొలిటికల్ కమెడియన్, జోకర్ లాగా మారిపోయారు. పరిస్థితి ఎంత దిగజారిందంటే.. ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో తన పర్యటనలు, ఆయా దేశాల అధినేతలతో తనకున్న సంబంధాల గురించి నిజాలు చెబితే కూడా జనాలు నమ్మకుండా కామెడీగా తీసుకోవడం మొదలైంది. మొత్తం తన విలువంతా పోగొట్టుకుని జనాల్లో జోకర్ లాగా తయారయ్యారాయన.
గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రజాశాంతి పార్టీని బరిలో నిలిపి పరాభవం ఎదుర్కొన్న పాల్.. ఇప్పుడు తెలంగాణలో పోటీకి సై అంటున్నారు. ఈ క్రమంలో ఆయన చేస్తున్న ప్రకటనలు అందరికీ కామెడీగానే అనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఏబీఎన్ అధినేత రాధాకృష్ణ.. పాల్‌తో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం చేశారు. ఐతే జనాలకు ఈ ప్రోగ్రాం పట్ల ఉన్న అంచనాల ప్రకారమైతే.. ఆర్కే పాల్‌ను ఒక ఆట ఆడుకుంటారని అనుకుంటారు. కానీ సీన్ రివర్సయింది. ఆర్కేనే పాల్ ఆటాడేసుకున్నారు. ఆర్కే ఏం మాట్లాడినా పాయింట్ పట్టుకుని లాజిక్కులతో కొట్టారు పాల్.
రాజకీయంగా తన పార్టీ ప్రభావం గురించి ఆర్కే తక్కువ చేసి మాట్లాడినపుడల్లా.. చంద్రబాబు పేరును తీసుకొచ్చి ఆయన్ని సీఎం చేద్దామని, టీడీపీని అధికారంలోకి తెద్దామనే కదా మీ ప్రయత్నం అంటూ కౌంటర్ చేశారు పాల్. తనకు ఎవ్వరూ విలువ ఇవ్వరని ఆర్కే అనడంపై స్పందిస్తూ.. మరి హోం మంత్రి అమిత్ షాను అపాయింట్మెంట్ లేకుండా ఎలా కలవగలిగాను అని ప్రశ్నించారు. తననుద్దేశించి జోకర్, కమెడియన్ లాంటి పదాలు వాడినపుడల్లా.. ఆర్కేకు గట్టిగానే పంచులు వేశారు పాల్. దీంతో ఫ్రస్టేషన్ పీక్స్‌కు వెళ్లిపోయి ఆర్కే కొన్నిసార్లు నోరు జారి తీవ్ర పదజాలం వాడారు. మొత్తంగా చూస్తే మాత్రం ఈ ఇంటర్వ్యూ బ్లాక్‌బస్టర్ అనే చెప్పాలి. నిన్నట్నుంచి సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఈ ఇంటర్వ్యూ తాలూకు వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇంత ఇంట్రెస్టింగ్, ఎంటర్టైనింగ్ ఇంటర్వ్యూ ఇంకోటి లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on May 24, 2022 11:09 am
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…